Begin typing your search above and press return to search.
ఈ సారి జేమ్స్ బాండ్ ఇండియా నుంచేనా?
By: Tupaki Desk | 29 July 2022 6:34 AM GMTస్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'RRR'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించారు. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య భారతీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. 1920 స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ వారిపై సమరశంఖం పూరించిన ఇద్దు పోరాట యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీం ల ఫింక్షనల్ స్టోరీగా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వరల్డ్ వైడ్ గా ఈ మూవీ తొలి షో నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కాసుల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి భారతీయ సినిమాల్లో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు, కొమురం భీం గా ఎన్టీఆర్ పలికించిన హావ భావాలు, రాజమౌళి టేకింగ్, దానయ్య మేకింగ్ వెరసి సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేలా చేశాయి.
మే 20న ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ లలో విడుదల చేశారు. దక్షిణాది భాషలకు సంబంధించి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 10 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వీక్షించిన తొలి భారతీయ సినిమాగా 'RRR' సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లోస్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని చూస్తున్న హాలీవుడ్ స్టార్స్ దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతభకు ఫిదా అవుతున్నారు. ఇలాంటి సినిమాని తప్పకుండా అందరు చూడాల్సిదే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాకుండా హాలీవుడ్ క్రిటిక్స్ సైతం 'RRR'ని ప్రత్యేకంగా చూడటం విశేషం. హాలీవుడ్ కు సంబంధించిన అత్యంత ప్రజాధారణ పొందిన టాప్ టెన్ సినిమాల్లో 'RRR'ని కూడా చేర్చడం మన సినిమాకు దక్కిన గౌరవం.
ఇదిలా వుంటే ఈ సినిమా చూసిన హాలీవుడ్ క్రియేటర్ తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ సరిగ్గా సరిపోతాడని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్వెల్స్ నుంచి వచ్చిన టెలివిజన్ సిరీస్ 'ల్యూక్ కేజ్'. దీనికి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, క్రియేటిర్ గా పని చేసిన చెయో హోదారి కోకర్ తాజాగా 'RRR' ని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించాడట.
'RRR' చూసిన తరువాత జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ అయితే బాగుంటాడని అతనికి అనిపించిందట. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించాడు. గత కొంత కాలంగా వరుసగా 'జేమ్స్ బాండ్' సీరీస్ చిత్రాల్లో డానియెల్ కేగ్ నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎక్కువ సిరీస్ లలో తను జేమ్స్ బాండ్ గా నటించాడు. ఆడియన్స్ కూడా ఆ పాత్రకు ఛేంజ్ కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం రామ్ చరణ్ పేరు వార్తల్లో నిలవడం ప్రధాన్యతను సంతరించుకుంది.
ఇంత వరకు ఇండియాకు దక్కని జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ఈ దఫా దక్కబోతోందా? ఇండియా నుంచే జేమ్స్ బాండ్ తెరపైకి రాబోతున్నాడా? అని ప్రస్తుతం ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా చెయో హోదారి కోకర్ చేసిన ట్వీట్ ని రామ్ చరణ్ అభిమానులు నెట్టంటి షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.