Begin typing your search above and press return to search.

దబాంగ్ లో సల్మాన్ లవర్ కూడా?

By:  Tupaki Desk   |   10 May 2017 8:09 AM GMT
దబాంగ్ లో సల్మాన్ లవర్ కూడా?
X
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ట్యూబ్ లైట్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ట్యూబ్ లైట్ విడుదల కానుండగా.. ఇప్పటికే మరుసటి ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఉంది. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన దబాంగ్ సిరీస్ ను కొనసాగించేందుకు సల్లూ భాయ్ ఫిక్స్ అయ్యాడు.

దబాంగ్ 3ని మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కండలవీరుడి సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించనుండగా.. ఇప్పుడో ఆసక్తికరమైన విషయం బైటకు వచ్చింది. దబాంగ్3లో సల్మాన్ ఖాన్ లవర్ యూలియా వంతూర్ కూడా ఓ పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తుందట. ఇప్పటికే సల్మాన్ కుటుంబానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ భాగం అవుతున్న యూలియా.. జస్ట్ సల్మాన్ తో మ్యారేజ్ మాత్రం చేసుకోలేదంతే. మిగతా అన్నీ ఆ ఇంటి మనిషిగానే జరిగిపోతున్నాయి.

ఇప్పుడు దబాంగ్3 మూవీలో కూడా నటించేయనుంది యూలియా వంతూర్. ఇది పూర్తి స్థాయి పాత్ర అని తెలుస్తోంది. అయితే.. యూలియా వంతూర్ ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన సోనాక్షి సిన్హా పాత్రను తీసేయడం జరగదని.. దబాంగ్3 లో కూడా సోనాక్షి సిన్హా పాత్ర యథాతథంగా ఉండనుంది.