Begin typing your search above and press return to search.

సల్మాన్ కొత్త లవర్ స్కిన్ షో చూశారా?

By:  Tupaki Desk   |   5 Jan 2016 1:30 PM GMT
సల్మాన్ కొత్త లవర్ స్కిన్ షో చూశారా?
X
రొమేనియా టీవీ స్టార్ లూలియా అంటే ఎక్కువ మందికి తెలీకపోవచ్చు కానీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ లవర్ లూలియా వంటూర్ అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తు పట్టేయలరు. కొన్నేళ్లుగా సల్లూభాయ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ భామ.

గతంలో కనిపించకుండా మెయింటెయిన్ చేసిన రిలేషన్ ను.. ఈ మధ్య ఓపెన్ చేసేస్తున్నారు వీళ్లిద్దరూ. పార్టీలకు కూడా కలిసి చెక్కేస్తున్నారు. డైరెక్టుగా ఫోటోలకు ఫోజులు ఇవ్వకపోయినా.. తీసుకునే వాళ్లని మాత్రం కాదనడం లేదు. దీంతో.. ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి, రొమేనియన్ టీవీ స్టార్ కి త్వరలో పెళ్లి అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే.. కండలవీరుడి లవర్ గా పాపులారిటీ రాగానే.. ఈ లూలియా తన గ్లామర్ ప్రదర్శన మొదలుపెట్టేసింది. రీసెంట్ గా ఓ ఫోటో షూట్ పెట్టింది.

రకరకాల డ్రెస్సులేసి తన అందాలను, వయ్యారాలను బాగానే పబ్లిసిటీకి పెట్టింది. మామూలుగానే తన దేశంలో గ్లామర్ ఫీల్డులో ఉన్న భామ అయ్యేసరికి.. తన మేని మెరుపులను ఇప్పుడు ఇండియన్స్ కు పంచుతోందన్న మాట. అమ్మడి అందాల ఆరబోత బాగానే ఉంది కానీ.. ఇలా సల్లూభాయ్ లవర్ గా నేమ్ తెచ్చుకున్నవాళ్లంతా.. తర్వాత ఇలాగే సొంతంగా ఫేమ్ కోసం ట్రై చేసి దూరమైపోయారు. అఫ్ కోర్స్ వాళ్లు బాగానే ఉన్నారనుకోండి. పాపం సల్మానే ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్ లవర్ కూడా షో మొదలుపెట్టేసరికి, సల్మాన్ ఫీల్ అవుతున్నాడని బాలీవుడ్ టాక్.