Begin typing your search above and press return to search.
`మా` వేడి..లంచ్ పార్టీ కూడా పోటా పోటీగానే!
By: Tupaki Desk | 16 Aug 2021 11:30 AM GMTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ఆడియన్స్ కు తరుచూ టచ్ లో ఉంటోన్న సంగతి తెలిసిందే. ఏదో విషయంపై ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా విషయాలకన్నా వ్యక్తిగత..ఇతర విషయాల్ని ఎక్కువగా పంచుకుంటున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ లో నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని మరింత చేరుయ్యే ప్రయత్నం చేసారు.
ఎప్పుడూ చెన్నై లో ఉండే ప్రకాష్ రాజ్ హైదరాబాద్ లో తిష్ట వేయడం వెనుక అసలు కారణం ఏంటి అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తు న్నాయి. నిన్న యధావిధిగా చెన్నై లోని జెండా వందనం చేసి వెంటనే హైదారాబాద్ బయలు దేరి వచ్చి ఇక్కడా అదే కార్యక్రమంలో `మా` ఎన్నికల్లో పోటీ చేసే తన ఫ్యానల్ సభ్యుల సమక్షంలో జెండా వదనం చేసారు. అనంతరం అంతా కలిసి ఒకే చోట భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
`మా` ఎన్నికల నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ఇలా తెలుగు నటులతో కలిసిపోతున్నారని...లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ని తొలగించే కార్యక్రంలో భాగంగా తెలుగు ఆడియన్స్ కి టచ్ లో ఉంటున్నారనే గుసగుస వినిపిస్తోంది. అయితే ఇలాంటి లంచ్ ఈవెంట్ నే నిన్నటి రోజున మా తాత్కలిక అధ్యక్షుడు నరేష్ కూడా ఏర్పాటు చేసారు. వాళ్లకు పోటీగానే ప్రకాష్ రాజ్ బృందం కూడా ఏర్పాటు చేసిందన్న కామెంట్ వినిపిస్తోంది. ఇక మా ఎన్నికలు సెప్టెంబర్ లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదుగురు సభ్యులు అద్యక్ష పదవికి బరిలో దిగుతున్నారు.