Begin typing your search above and press return to search.
కోర్టు కేసులో లైకాకి జరిమానా.. నిజాయితీ నెగ్గిందన్నవిశాల్!
By: Tupaki Desk | 19 Aug 2021 12:30 AM GMTకోలీవుడ్ లో కోర్టు పిటీషన్ల కలకలం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మద్రాస్ హైకోర్టు ఇటీవల కోలీవుడ్ స్టార్ల కేసులపై సీరియస్ అవ్వం ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తారల పన్ను మినహాయింపు అర్జీలపై తీర్పులు సంచలనంగా మారుతున్నాయి. గతంలో ఫైల్ అయిన కేసులన్నీ ఒక్కొక్కటిగా హైకోర్టులో హియరింగ్ కి వస్తున్నాయి. మద్రాసు పరిశ్రమ సెలబ్రిటీల కేసులపై తీర్పులివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్టార్ హీరోలు ధనుష్.. విజయ్ కి సంబంధించిన పన్ను మినహాయింపుల కేసుల్లో హీరోల పిటీషన్లను కొట్టేసి షాక్ ఇచ్చింది. నిన్నటి రోజున సూర్య ఆస్తుల వ్యవహారం కూడా హియరింగ్ కి రావడం..వాటిపై కోర్టు కన్నెర జేసి మొత్తం డబ్బు కట్టాలని సూర్య పిటీషన్ కొట్టేసి తీర్పునిచ్చింది. తాజాగా తెలుగు- తమిళ నటుడైన విశాల్ కేసుపై కూడా మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇది ఇతరులకు భిన్నమైన కేసుగా పరిగణించాలి.
విశాల్ కథానాయకుడిగా నటిస్తోన్న `చక్ర `సినిమాపైనా.. విశాల్ పైనా లైకా ప్రొడక్షన్స్ కేసులు వేసిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ తో విశాల్ కి ఉన్న విబేధాల కారణంగా ఈ కేసు ఫైల్ అయింది. నేడు కేసు విచారణకు రాగా మద్రాసు హైకోర్టు విశాల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. లైకా ప్రొడక్షన్స్ వేసిన కేసులన్ని తప్పుడు కేసులుగా పరిణగిస్తూ కేసును కొట్టేసింది. అలాగే లైకాకి ఐదు లక్షల జరిమానా కూడా విధించింది.
దీనిపై విశాల్ స్పందిస్తూ... న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఆ నమ్మకం నేడు నిజమైంది. నిజాయితీ ఎప్పుడూ న్యాయస్థానం ముందు గెలుస్తుంది. నాపై లైకా సంస్థ వేసిన కేసులు తప్పుడువని న్యాయస్థానం నమ్మింది కాబట్టి కేసులను కొట్టేసింది. ఐదు లక్షలు జరిమానా విధించింది. ఇదంతా లైకా ప్రొడక్షన్స్ నన్ను మానసికంగా వేధించినందుకేనని నమ్ముతున్నానని విశాల్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం విశాల్ తన 31వ చిత్రం తుప్పరివాలన్ లో నటిస్తున్నాడు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ షూట్ లో వీపుకి బలమైన గాయం అయింది. ప్రస్తుతం విశాల్ కొలుకున్నారు. చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. విశాల్ కోలీవుడ్ టాలీవుడ్ లో తన స్టార్ డమ్ ని కొనసాగిస్తున్నారు. ద్విభాషా చిత్రాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
విశాల్ మరోవైపు నిర్మాతల మండలి సహా నడిగర సంఘం లో హవా సాగిస్తున్న తెలుగు హీరోగా పాపులరయ్యారు. అతడి హవాకి ఎదురేలేదని ప్రూవైంది. ఇక నడిగర సంఘం భవంతి నిర్మాణం పూర్తి చేయడంలోనూ విశాల్ కృషికి గుర్తింపు దక్కింది. అతడిపై ప్రత్యర్థి వర్గం పై చేయి సాధించే ప్రయత్నం చేసినా తన వర్గం అతడికి బలమైన అండగా నిలుస్తున్న సంగతి తెలిసినదే. మరోవైపు ప్రస్తుత మల్టీస్టారర్ ట్రెండ్ లో విశాల్ కూడా తెలుగు-తమిళ స్టార్లను కలుపుకుని భారీ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాల్ కి హైదరాబాద్ లోనూ ఆఫీస్ ఉన్న సంగతి తెలిసిందే.