Begin typing your search above and press return to search.

అత్తారింటి రీమేక్ నష్టం లెక్క వింటే అవాక్కే

By:  Tupaki Desk   |   28 Sept 2019 5:26 AM
అత్తారింటి రీమేక్ నష్టం లెక్క వింటే అవాక్కే
X
సాధారణంగా ఒక భాషలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేస్తే.. హిట్ పక్కా అన్నది నమ్మకం. ఒకవేళ.. తేడా కొట్టినా మినిమం లాభాలతో లేదంటే.. లాభం.. నష్టం లేని రీతిలో బయటపడటం ఇప్పటివరకూ చూశాం. అందుకు భిన్నమైన పరిస్థితి అత్తారింటికి దారేది రీమేక్ లో చోటు చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. పవన్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది అత్తారింటికి దారేది విజయం.

ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ముందుకొచ్చి హక్కుల్ని సొంతం చేసుకుంది. తమిళ వెర్షన్ లో ప్రముఖ నటుడు శింబుతో చేశారు.

అత్తారింటికి దారేది చిత్రాన్ని వందా రాజావాదాన్ వరువేన్ పేరుతో తమిళ్ లో రీమేక్ చేసిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఊహించని రీతిలో దారుణమైన అపజయాన్ని చవిచూసింది. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన నష్టం మీద నిర్మాణ వర్గాలు అధికారికంగా లెక్కలు చెప్పిన వైనం అవాక్కు అయ్యేలా చేసింది.

ఈ సినిమా కారణంగా తమకు రూ.14 కోట్లు నష్టం వాటిల్లినట్లుగా లైకా వెల్లడించింది. ఒక సూపర్ డూపర్ సినిమా రీమేజ్ లో ఇంత భారీ అపజయాన్ని ఎందుకు మూటగట్టుకున్నదన్నది ఒక పట్టాన అర్థం కావట్లేదట. దీనికి కారణం ఏమై ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.