Begin typing your search above and press return to search.
#భారతీయుడు 2.. కోర్టు నోటీసులపై శంకర్ స్పందించలేదా?
By: Tupaki Desk | 1 April 2021 8:14 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సెన్నేషన్స్ గురించి తెలిసిందే. 1996లో రిలీజైన ఈ చిత్రం అవినీతి పై శంకర్ సంధించిన అస్త్రం. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది అనగానే అభిమానుల్లో ఒకటే ఉత్సాహం. కానీ ఆ ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సీక్వెల్ విషయంలో వరుస ఇన్సిడెంట్స్ షాకిచ్చాయి.
ఆరంభమే లైకా సంస్థతో దర్శకుడు శంకర్ కి గొడవలు తలెత్తడం.. అటుపై సెట్స్ కి వెళ్లాక నటీనటులకు అనారోగ్యాలు కలతలు ఆటంకంగా మారాయి. ఆ తర్వాత క్రేన్ యాక్సిడెంట్ అనూహ్యమైన పరిణామానికి తెర తీసింది. ఇవన్నీ లైకా ప్రొడక్షన్స్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. లైకా సంస్థతో శంకర్ కి కమల్ హాసన్ కి కూడా తీవ్ర వివాదాలు తలెత్తాయి. ఇదే సమయంలో మహమ్మారీ రంగ ప్రవేశం చేయడం లాక్ డౌన్ వంటి అంశాలు పులిమీద పుట్రలా మారాయి.
కారణం ఏదైనా కానీ భారతీయుడు 2 (ఇండియన్ 2)పై ఇప్పటివరకూ సరైన క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా పూర్తి చేయనందుకు దర్శకుడు శంకర్ పై లైకా సంస్థ న్యాయ పోరాటం ప్రారంభించిందని తెలిసింది. కోలీవుడ్ మీడియా సమాచారం మేరకు..భారతీయ 2 ని శంకర్ పూర్తి చేయలేదని ఆరోపిస్తూ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాల్సిన ఈ సినిమా కోసం 230 కోట్లు కేటాయించింది. ఇప్పటికే అంత పెద్ద మొత్తం ఖర్చు చేశారు. మిగిలిన వేతనాలను కోర్టులో జమ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. 2019 ఆరంభంలో మొదలైన ఈ చిత్రం చివరిలో సెట్స్ లో జరిగిన ప్రమాదం తర్వాత నిలిచిపోయింది. నాటి నుంచి కోర్టుల పరిధిలో కలతలు తప్పడం లేదు. లైకాతో శంకర్ ఈగో సమస్య కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా భారతీయుడు 2 సెట్స్ లో ఉన్న ఇద్దరు సిబ్బంది మరణంతో కమల్ హాసన్ .. శంకర్ తీవ్రంగా లైకాపై విరుచుకుపడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం కలకలం రేపింది. కానీ ఆ తర్వాత సర్ధుబాటు అవుతుందని రాజీకి వచ్చి సినిమా పూర్తి చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ అది జరగడం లేదు.
ఇదిలా ఉండగానే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా శంకర్ భారీ చిత్రం ప్రారంభమవుతోందనే కథనాలు హీట్ పెంచుతున్నాయి. కానీ లైకా ప్రొడక్షన్స్ శంకర్ పై చట్టబద్ధంగా పోరాడాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ కూడా అటు బుల్లితెర రియాలిటీ షోలు ఎన్నికలు అంటూ భారతీయుడు 2 గురించి ప్రస్థావించకపోవడం అభిమానులకు షాకిస్తోంది. ఇప్పటివరకూ కోర్టు నోటీసులపై శంకర్ స్పందించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శకనిర్మాతలు రాజీకొచ్చి పూర్తి చేస్తారన్న హోప్ ఇప్పటికీ అభిమానులకు ఉంది. మరి లైకా - శంకర్ బృందం ఏం చేస్తారో వేచి చూడాలి.