Begin typing your search above and press return to search.
అప్పులు కష్టాలు అంటూనే అగ్ర బ్యానర్ ఇదేం ట్విస్టు?
By: Tupaki Desk | 30 Oct 2020 1:00 PM GMTఅప్పుల్లో మునిగామంటారు. భారీ సినిమాలతో నష్టాలొచ్చాయంటారు. ఫైనాన్సులు వడ్డీలు బెడద మాకెందుకు అంటూ కష్టాల కడలి చిట్టా విప్పుతారు. ఎన్ని జరిగినా కానీ సినిమాలు ఆపరు. ఒక భాషలో సినిమాలు చేస్తూనే ఇరుగు పొరుగునా సత్తా చాటేందుకు ప్రణాళికల్ని వేస్తారు. ఆరు నూరైనా అన్నిచోట్లా మేమున్నాం అని అంటారు. ఇప్పుడు అదే కోవలో ప్రముఖ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ పేరు మార్మోగుతోంది.
ఓవైపు కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ బడ్జెట్ ని కుదించేసిన ఈ బ్యానర్ .. తదుపరి షెడ్యూల్ మాటెత్తితే దర్శకుడితో గొడవ పడిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఇంతలోనే బాలీవుడ్ లోకి పెద్ద ఎత్తున ప్రవేశించాలనే సదరు ప్రతిష్టాత్మక బ్యానర్ నిర్ణయించుకుందని కథనాలొస్తున్నాయి.
ఇంతకుముందు 2.0 వంటి అతి భారీ చిత్రాన్ని నిర్మించిన ఈ బ్యానర్ తీవ్రంగా నష్టాలు చవి చూసిన మాట వాస్తవమే. ఆ తర్వాత భారతీయుడు 2 కోసం పెట్టుబడులు పెడుతున్నా ఏదీ కలిసి రావడం లేదు. రకరకాల అవాంతరాలు భారీ నష్టానికి కారణమయ్యాయి. ఆ క్రమంలోనే కమల్ హాసన్ ... శంకర్లతో లైకా అధినేతల ఘర్షణ తెలిసినదే.
ఇదంతా ఇలా ఉండగానే.. తాజా కథనం ప్రకారం.. లైకా తొందర్లోనే హిందీ పరిశ్రమలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉందట. లైకా ప్రొడక్షన్స్ హిందీలో తొలి చిత్రం కోసం అభిషేక్ బచ్చన్ ని లాక్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 65 కేరట్స్ అంటూ టైటిల్ పై ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని లైకా పెద్ద ఎత్తున నిర్మించనుందిట. అక్షయ్ కుమార్ - రజనీకాంత్ నటించిన 2.0 విడుదలయ్యాక.. లైకా హిందీ చిత్రాలలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తోందట. ఎట్టకేలకు ఆ కలను నిజం చేసుకుంటోంది. అయితే కమల్ హాసన్ భారతీయుడు 2 గురించి లైకా పెదవి విప్పకపోవడానికి కారణమేంటో కూడా తేలాల్సి ఉంది.