Begin typing your search above and press return to search.
శంకర్ దెబ్బకు మళ్ళీ అలోచనలో లైకా?
By: Tupaki Desk | 9 March 2019 6:47 AM GMTస్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రెస్. శంకర్ సినిమాల బడ్జెట్ ను తట్టుకోవడం సాధారణ నిర్మాతల వల్ల అయ్యేపనే కాదు. అందుకే తనకు తగ్గట్టుగా ఉండే భారీ నిర్మాతలు ఎంచుకుంటాడు శంకర్. కానీ ఈ సారి అలాంటి నిర్మాతలకే చుక్కలు కనిపిస్తున్నాయట. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో 'భారతీయుడు 2' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాతలు. 'భారతీయుడు 2' షూటింగ్.. విషయంలో వారు అసంతృప్తిగా ఉన్నారని కొలీవుడ్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
'భారతీయుడు 2' రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువగా అవుతోందని అప్పట్లో సినిమాను ఆపేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని నిర్మాతలు ప్రకటించారు. తర్వాత షూటింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సమస్యే ఎదురైందని కోలీవుడ్లో టాక్ విన్పిస్తోంది. మొదటి షెడ్యూల్ బడ్జెట్ అంచనా రెండున్నర కోట్లు కాగా ఆరు కోట్ల వరకూ ఖర్చయిందట. పోనీ అంత ఖర్చు పెట్టినా ఆ షెడ్యూల్ లో ముందు అనుకున్నట్టుగా అన్నీ సీన్లను చిత్రీకరించలేక పోయారట.
కమల్ కు మేకప్ చేసేందుకే ఎక్కువ సమయం అవుతోందని.. దీంతో షూటింగ్ కూడా డిలే అవుతోందని సమాచారం. దీంతో కమల్ తన రెమ్యూనరేషన్ పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాడట. ఇవన్నీ గమనిస్తున్న లైకావారు ఈ ప్రాజెక్టును ఇంతటితో ఆపేస్తే మంచిదనే దిశగా చర్చిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.