Begin typing your search above and press return to search.
చెర్రీతో 2.0 ప్రొడ్యూసర్స్ భారీ ప్లాన్?
By: Tupaki Desk | 5 July 2017 12:26 PM GMTరామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985ను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. దీపావళి నాటికి ఈ చిత్రం పూర్తి కానుందనే అంచనాలు ఉండగా.. రంగస్థలం తర్వాత చెర్రీ సినిమా ఇంకా కన్ఫాం కాలేదు.
కొరటాల శివతో మెగా పవర్ స్టార్ మరుసటి చిత్రం ఉంటుందనే టాక్ మాత్రం ఉంది. అయితే.. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ సంస్థ.. రామ్ చరణ్ తో ఓ భారీ ప్లాన్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ తో శంకర్ దర్శకత్వంలో 2.0 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్.. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 చిత్రానికి సహనిర్మాణం వహించిన ఈ సంస్థ.. ఇప్పుడు చరణ్ తో ఓ బైలింగ్యువల్ తీయాలని చూస్తోందట. తమ సంస్థ బ్రాండ్ ను మరింతగా విస్తృతం చేయగల హీరో కోసం అన్వేషించిన లైకా ప్రొడక్షన్స్.. తెలుగులో ఓంప్రదంగా చెర్రీతో మొదలెట్టేసి.. తరువాత ఇతర స్టార్లతో సినిమాలు చేస్తారట.
అయితే.. తెలుగులో ఈ మెగా హీరోతో చేసే చిత్రాన్ని తమిళ్ లో కూడా వర్కవుట్ అయ్యేలా తీయాలంటే.. అది దర్శకుడు మురుగదాస్ తో మాత్రమే సాధ్యం అని ఫిక్స్ అయ్యారట కూడా. అందుకే రామ్ చరణ్ - మురుగదాస్ కాంబోపై మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ కన్ఫాం అని చెప్పలేం కానీ.. ప్రస్తుతం టాక్స్ మాత్రం మంచి జోరు మీదే ఉన్నాయట.