Begin typing your search above and press return to search.
#షాక్: డైలమాలో `భారతీయుడు 2`
By: Tupaki Desk | 4 March 2020 4:29 AM GMT`ఇండియన్-2` కి ఆదినుంచీ అవాంతరాలే. ఏ మూహర్తాన ప్రాజెక్ట్ ప్రకటించారో.. తొలి నుంచి శంకర్-కమల్ హాసన్ ద్వయాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభానికి ముందు సరైన నిర్మాణ సంస్థ కుదరక శంకర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా లైకా ప్రొడక్షన్ తో ఒప్పందం అనంతరం బడ్జెట్ పెరుగుతుందన్న కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది. లైకాతో శంకర్ వివాదం వేడెక్కించింది. తాజాగా ఆన్ సెట్స్ క్రేన్ ప్రమాదం చిత్ర వర్గాల్లో తీవ్ర మనస్పర్థలకు కారణమైంది.
తాజా దుర్ఘటనకు సంబంధించి ప్రస్తుతం కమల్ హాసన్..శంకర్..చిత్ర నిర్మాత సుభాష్కరణ్ అండ్ టీమ్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అటు కమల్ హాసన్-సుభాస్కరన్ మధ్య చెడిందన్న కథనాలు ఇప్పటికే వేడెక్కిస్తున్నాయి. కమల్ కారణం గా షూటింగ్ వాయిదా పడుతోందని..వీలైనంత త్వరగా తిరిగి సెట్స్ కు రావాలని లైకా కమల్ ని ఉద్దేశించి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు లైకా అధినేత తీరుపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం తాజా పరిస్థితికి అద్దం పట్టింది.
కార్మికులకు భీమా కల్పించాలని..ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని లేదంటే షూటింగ్ కి రానని కమల్ హాసన్ హెచ్చరించారు. దానికి ప్రతిగానే లైకా లేఖతో బదులిచ్చింది. అయితే ఈ లేఖ కమల్ తో లైకాకు మరింత దూరం పెరిగిందని కోలీవుడ్ వర్గాలు మాట్టాడుకుంటున్నాయి. కమల్ వ్యాఖ్యలతో పాటు లైకా లేఖ కూడా అక్కడి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కమల్ ఇండియన్ -2 నుంచి తప్పుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని ప్రస్తుత సన్నివేశం అలానే ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి కమల్ కాల్షీట్లు ఇచ్చింది `శభాష్ నాయుడు` చిత్రానికి సంబంధించి..మాత్రమే. కానీ ఆ సినిమా ఆగిపోవడంతో కమల్ ని ఇండియన్-2 లో నటించేలా ఒప్పించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యం లో సదరు సంస్థ పై కమల్ పూర్తిగా అసంతృప్తి గా ఉన్నారని కథనాలు వేడెక్కిస్తున్నాయి.