Begin typing your search above and press return to search.
లిరికల్ సాంగ్: మామ అల్లుళ్ల బంధం
By: Tupaki Desk | 7 Nov 2019 3:42 PM GMTవిక్టరీ వెంకటేష్- నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్- పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డి.సురేష్ బాబు- విశ్వ ప్రసాద్ నిర్మాతలు. మామ - అల్లుళ్లను కలిపి బాబి చేస్తున్న ఈ ప్రయత్నంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదివరకూ రిలీజ్ చేసిన టీజర్.. పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. దసరా దీపావళి అంటూ మామ అల్లుళ్ల పోస్టర్లతో ఆకట్టుకున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి తొలి సింగిల్ రిలీజైంది. మామ అల్లుళ్లపై టైటిల్ గీతం ఇది. థమన్ మార్క్ ట్యూన్.. యథావిధిగా రామ జోగయ్య మార్క్ లిరిక్ నెమ్మదిగా ఫ్యాన్స్ లోకి దూసుకెళుతుందనడంలో సందేహం లేదు. శ్రీకృష్ణ ఈ పాటను పాడారు. ట్యూన్ ... లిరిక్ రొటీన్ గా ఉన్నా ఆ సందర్భానికి తగ్గట్టుగా మామ - అల్లుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరిస్తోంది. అల్లుడికి మామ ఎలా బ్యాక్ బోన్ గా నిలుస్తాడు? మామ అంటే ఆ అల్లుడికి ఎంత ప్రేమ.. ఒకరంటే ఒకరికి ఉండే ఆ అద్భుతమైన అనుబంధం నేపథ్యంలో ఈ పాట ఆకట్టుకుంది.
పచ్చని పంట పొలాలు.. పల్లెటూరి నేపథ్యం కన్నుల పండుగనే తలపించనుందని అర్థమవుతోంది. ఇక మామ అల్లుళ్లు పంచె కట్టులో ట్రీటివ్వబోతున్నారు. సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమాని అంతకుముందే డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్- రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.