Begin typing your search above and press return to search.
దిల్లీవాలా: థమన్.. మరో ఎనర్జిటిక్ ట్యూన్
By: Tupaki Desk | 21 Dec 2019 5:33 AM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'. పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్..తాన్య హోప్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచారకార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 'నువ్వు నాతో ఎమన్నావో' అంటూ రెట్రో స్టైల్ లో సాగేఒక పాటను రిలీజ్ చేశారు. ఆ పాట ఇప్పటికే సంగీత ప్రియులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుండి 'దిల్లివాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు థమన్. 'దిల్లివాలా' పాట కు సాహిత్యం అందించినవారు రామజోగయ్య శాస్త్రి. పాడిన వారు ఆదిత్య అయ్యంగార్.. రాహుల్ నంబియార్.. గీతా మాధురి. "తరగని గని ఇతడు సుగుణములెన్నిటికో మమతల సిరి ఇతడు ప్రియతములెందరికో.. ఇరుకు గదిలో గగనమితడు ఇలను వదలని చలనమితడు మనకులాగే బ్రతుకు లాగే సగటు మనిషితడు.. దిల్లివాలా దిల్లివాలా" అంటూ సాహిత్యం సాగింది. ఈ పాటకు థమన్ ఓ ఎనర్జిటిక్ ట్యూన్ అందించాడు. సాంగ్ ప్రారంభంలో.. మధ్యలో వచ్చిన ఇన్స్ ట్రుమెంటేషన్ చాలా ట్రెండీగా ఉంది. ఈ ట్యూన్ కు తగ్గట్టే సింగర్స్ అందరూ ఫుల్ జోష్ లో పాడారు. మధ్య లో హిందీ లిరిక్స్ కూడా రావడం తో పాటకు డిఫరెంట్ ఫీల్ ఉంది.
ఇక పాట లో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సగటు మధ్య తరగతి దిల్లి వ్యక్తి లాగా మాస్ రాజా కనిపించాడు.. నభ నటేష్ తో సరదాగా తిరిగే సీన్స్ అందంగా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు.. ఈ దిల్లివాలాను వినేయండి.. ఆ విజువల్స్ కూడా చూసేయండి.