Begin typing your search above and press return to search.
లిరికల్ వీడియో: ఒంటి కాయ సొంటి కొమ్ము 'మామ'
By: Tupaki Desk | 16 Nov 2019 7:51 AM GMTవిక్టరీ వెంకటేష్- నాగచైతన్య కథానాయకులు గా నటిస్తున్న `వెంకీమామ` డిసెంబర్ లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు స్వింగు లో ఉన్నాయి. ఇంకా నెలరోజుల సమయం కూడా లేదు .. ప్రచారానికి ఇంకెంతో టైమ లేనే లేదు కాబట్టి అందుకు తగ్గట్టు స్పీడ్ పెంచుతోంది టీమ్. ఈ సినిమా కి సంబంధించిన పోస్టర్లు.. లిరికల్ వీడియోల తో రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇంతకు ముందు దీపావళి-దసరా పోస్టర్లు ఆకట్టుకున్నాయి.
తాజాగా వెంకీ మామ పై రిట్రో సాంగ్ లిరికల్ వీడియోని లాంచ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం విక్టరీ వెంకటేష్ - పాయల్ రాజ్ పుత్ జంట విన్యాసాలు సహా దర్శకుడు బాబి- కొరియోగ్రాఫర్ రాజు సుందరం తదితర బృందాన్ని వీడియోలో చూపించారు. ఇక మామ రిట్రో గెటప్ కేకో కేక. బెల్ బాటమ్ ఫ్యాంటు తొడిగి.. 80ల నాటి డిజైనర్ షర్టు తొడిగి .. కళ్ల కు నల్లద్దాల తో రిట్రో డేస్ ఎన్టీఆర్ ఏఎన్నార్ లనే తలపించారు మరి. తనకు పోటీగా అందాల పాయల్ రాజ్ పుత్ జయప్రద రేంజులో రిట్రో లుక్ తో ఆకట్టుకుంది. నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు ప్రత్యేకించి అప్పటి అంబాసిడర్ బ్రాండ్ కార్లను.. ఖరీదైన పడవలాంటి కార్లను ఈ పాట కోసం ఉపయోగించారు. ఇండోర్ షూటింగ్ అదరహో అనే చెప్పాలి.
"ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో.. ఒంటి కాయ సొంటి కొమ్ము సెంటు కొట్టెరో.. ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలెత్తెనో మొలకలేసెనో" అంటూ మామ గుట్టు మొత్తం విప్పేశాడు లిరిసిస్ట్ శ్రీమణి. ఈ లిరిక్ ని బట్టి అసలు పెళ్లి అన్నదే వద్దనుకునే వెంకీమామ ఉన్నట్టుండి పాయల్ టీచర్ తో ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిణామాలు తలెత్తాయి? అన్నది చూపబోతున్నారని అర్థమవుతోంది. పైగా ఈ ముళ్లు ఏదో 20ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటేనా..! అంటూ అల్లుడు చైతూ ఊహల్లో తేలి పోతుంటే అప్పుడు వస్తుంది ఈ సాంగ్. రెట్రో సాంగ్ ఆకట్టుకుంది. దీనికి థమన్ ఇచ్చిన బీట్ క్యాచీ గానే ఉంది. రెట్రో స్టైల్ కి తగ్గట్టే ఉందీ మ్యూజిక్. క్రియేటివిటీ కోసం పాకులాడకుండా సేఫ్ జోన్ బీట్ వైపే మొగ్గు చూపాడు థమన్. ఇక ఇందు లో శ్రీమణి మరోసారి లిరికల్ వేడి అంటే ఏమిటో చూపించే ప్రయత్నం చూపించాడు. సింపుల్ పడికట్టు పదాల తోనే క్యాచీగా పాడుకునేలా రాశాడు. ఏ ఊహలు లేని గుండెలో పొట్ల కాయ విత్తనాలు అంటూ శ్రీమణి చాలానే మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు.
రాజు సుందరం మాస్టార్ ఇలాంటి రెట్రో పాటల కు స్పెషలిస్ట్. ఆయన కొరియోగ్రఫీ లో మామ సరి కొత్తగానే కనిపించబోతున్నాడు. ఇక పాయల్ అంద చందాలు ఫ్యాన్స్ కి మరోసారి కనువిందు చేయనున్నాయి. ఇంతకుముందు ఆర్.ఎక్స్ 100.. ఆర్.డీ.ఎక్స్ లో విచ్చల విడిగా అందాల్ని ఆరబోసిన పాయల్ ని అవే కళ్లతో చూస్తే కాస్త పద్ధతిగా ఉందేమో అనిపిస్తోంది ఈ పాటలో.. ప్చ్!!