Begin typing your search above and press return to search.

జనాలు పాటలను సరిగ్గా వినడం నేర్చుకోవాలట!

By:  Tupaki Desk   |   3 May 2022 4:30 AM GMT
జనాలు పాటలను సరిగ్గా వినడం నేర్చుకోవాలట!
X
ఈమద్య కాలంలో తెలుగు సినిమా పాటల విషయంలో విమర్శలు వస్తున్నాయి. చిన్న హీరోల సినిమాలు మొదలుకుని పెద్ద హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్కరి సినిమాల్లో పాటల్లో మెజార్టీ పాటల్లో ఉన్న లిరిక్స్ అర్థం అయ్యే పరిస్థితి లేదు. కొన్ని పాటల్లో మ్యూజిక్ డామినేట్‌ చేస్తూ ఉంటే మరి కొన్ని పాటల్లో సింగర్ వాయిస్‌ సాహిత్యంను కూనీ చేస్తుంది. మొత్తానికి ఏదో ఒక కారణంతో సాహిత్యం కనిపించకుండా పోతుంది.

మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి సక్సెస్ అవుతున్న పాటలు కొన్నయితే.. మరికొన్ని మాత్రం కనీసం కనిపించకుండా పోతున్నాయి. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నుండి వచ్చిన కళావతి పాట విషయంలో అదే విమర్శలు వ్యక్తం అయ్యాయి. సిద్‌ శ్రీరామ్‌ తో సంగీత దర్శకుడు థమన్‌ పాటను పాడించడం జరిగింది. సాహిత్యం విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి.

ఎన్నో వందల తెలుగు సినిమాల పాటలను రాసిన అనంత శ్రీరామ్‌ కళావతి పాటకు సాహిత్యం ను అందించాడు. ఆయన అందించిన సాహిత్యంను సిద్‌ శ్రీరామ్‌ అర్థం కాకుండా చేశాడు అంటూ కొందరు ట్రోల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్‌ మీడియా ముందుకు వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కళావతి పాట వివాదం విషయమై స్పందిస్తూ సిద్‌ శ్రీరామ్‌ ది ఏం తప్పులేదని.. అతడి ఉచ్చరణ ఏమాత్రం తప్పు కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా పాటలు మారుతున్నాయి. వాటికి అనుగుణంగా ప్రేక్షకులు శ్రోతలు పాటలు వినడం నేర్చుకోవాలని.. పాటలు వినే విధానంలో తమ ఆలోచన విధానంను మార్పుకోవాలంటూ సలహా ఇచ్చాడు.

సంగీతం డామినేట్‌ చేసి సాహిత్యం వినిపించకుంటే సరే అనుకుంటాం.. కాని సిద్‌ ఉచ్చరణ సరిగా చేయకుండా ప్రేక్షకులు సరిగ్గా వినడం నేర్చుకోవాలంటూ అనంత శ్రీరామ్‌ సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అనంత శ్రీరామ్‌ వ్యాఖ్యలకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సిద్‌ శ్రీరామ్‌ ను వెనకేసుకు వచ్చేందుకు మొత్తం ప్రేక్షకులను మారాలని.. నేర్చుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందని.. అంతకు మించి ఈ విషయమై ఆయన స్పందించకుండా ఉంటే బాగుండేది కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.