Begin typing your search above and press return to search.
#చిరు150: స్క్రీన్ పై నా పేరు రావల్సిందే
By: Tupaki Desk | 30 April 2016 5:42 AM GMTమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫైనల్ కాగానే మొదలైన మొదటి వివాదం కథ గురించే. అసలు ఏ సినిమాని చేయాలా అనే విషయం చిరు తేల్చుకోవడానికే చాలా సమయం పట్టగా.. తీరా ఒక రీమేక్ ని ఓకే చేశాక, స్టోరీ రైట్స్ అంటూ వివాదం మొదలైంది. ఎం.నరసింహారావు అనే రచయిత ఈ కథ తనదే అని, తనకు రైటర్ క్రెడిట్స్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు.
ఆ తర్వాత ఈ వివాదం సంగతి ఏమైందో తెలీలేదు. ఇప్పుడు చిరు నటిస్తున్న కత్తిలాంటోడు మూవీ స్టార్ట్ అయిపోయింది. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరగనిచ్చేది లేదంటూ చెప్పిన రైటర్ ఇప్పుడు తన వెర్షన్ చెబుతున్నాడు. 'దర్శకుడు వివి వినాయక్ నాతో ఫోన్ లో మాట్లాడి, ఇష్యూని సెటిల్ చేస్తానని చెప్పారు. నా బాధంతా స్టోరీ క్రెడిట్స్ కోసమే. ఈ స్టోరీని రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేయించాం, దాన్ని వెరిఫికేషన్ కూడా చేశారు. అయితే, రైటర్ గా నా పేరు వేయడంలో ఇంకా పూర్తి భరోసా రాలేదు' అంటున్నాడు ఈ రైటర్.
వినాయక్ పర్సనల్ గా మాట్లాడ్డంతో ప్రస్తుతానికి చిరు సినిమాకి అడ్డు పడే ఉద్దేశ్యం లేదన్న ఈ రైటర్.. రెమ్యూనరేషన్ విషయంలో పట్టు పట్టనని చెబుతున్నాడు. డబ్బులు ఎంతిచ్చినా ఓకే కానీ.. స్క్రీన్ పై పేరు మాత్రం కనిపించాలని ఇతని వెర్షన్.