Begin typing your search above and press return to search.

‘మా’ ఈసీ మీటింగ్ ఎలా జరిగింది? ఏం నిర్ణయించారు?

By:  Tupaki Desk   |   30 July 2021 3:08 AM GMT
‘మా’ ఈసీ మీటింగ్ ఎలా జరిగింది? ఏం నిర్ణయించారు?
X
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ గురువారం జరిగింది. ముందుగా అనుకున్న దానికి భిన్నంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు నలుగురుగా ఉన్న క్రమశిక్షణ సంఘం.. తాజాగా మరో ఇద్దరు సభ్యుల్ని చేర్చారు. దీంతో.. క్రమశిక్షణా సంఘం సభ్యుల సంఖ్య ‘6’కు చేరుకుంది. వర్చువల్ విధానంలో సాగిన ఈ భేటీలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్.. కార్యదర్శి జీవిత రాజశేఖర్ తో పాటు ఇతర ఈసీ మెంబర్లు హాజరయ్యారు.

అయితే.. తాజా ఈసీ భేటీ స్పెషల్ ఏమంటే.. కొత్త సభ్యులు అదనంగా చేరటం.. తాజాగా నిర్ణయించిన సభ్యుల్లో సీనియర్ నటుడు గిరిబాబు తో పాటు శివక్రిష్ణలను చేర్చుకున్నారు. ఆగస్టు మూడో వారంలో సర్వసభ్య సమావేశం జరపాలని నిర్ణయించారు. సెప్టెంబరులో ఈ మీటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. తాజాగా చేరిన ఇద్దరు సభ్యులతో కలిపి మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు.

అతి త్వరలోనే క్రమశిక్షణా సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. సర్వసభ్య సమావేశాన్ని ఎప్పుడు నిర్ణయించాలో డిసైడ్ చేస్తారు. ఇటీవల కాలంలో తెర మీదకు వచ్చిన పలు అంశాలకు సంబంధించి.. ‘మా’ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్న కృష్ణమోహన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న బాడీకి చట్టబద్ధత ఉందని.. కొత్త కమిటీ వచ్చే వరకు పాత కమిటీ కొనసాగుతుందని తేల్చారు. అప్పటివరకు దాని చట్టబద్ధతకు ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వచ్చే నెల మూడో వారంలో జరిగే సర్వసభ్య సమావేశం ‘మా’ ఎన్నికలు ఎప్పుడన్న విషయాన్ని తేలుస్తుందని చెప్పొచ్చు.