Begin typing your search above and press return to search.
క్యాస్టింగ్ కౌచ్..ఎట్టకేలకు కీలక నిర్ణయం
By: Tupaki Desk | 2 May 2018 6:02 PM GMTతెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు టాలీవుడ్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు సినీ పెద్దలు సమావేశమై అనేక దఫాలుగా చర్చించారు. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమ (టీఎఫ్ఐ) కార్యాచరణను ప్రకటించింది.సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలుగు సినిమా డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
తాజాగా సమావేశమైన డైరెక్టర్ల సంఘం ఇటీవలి పరిణామాలను చర్చించింది. ఇటీవల కొన్ని సంఘటనల్లో కొందరు వ్యక్తులు వివిధ వేదికల్లో తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడిందని పేర్కొంది. దీంతో పరిశ్రమలో అన్ని వర్గాలు ఏకమై ఈ అంశాలపై కూలంకుషంగా చర్చించి సరైన తీరులో స్పందించాలని నిర్ణయించాల్సిందేనని భావించి ఇందులో భాగంగా కొన్ని దీర్ఘాకాలిక నిర్ణయాలు, మరికొన్ని స్వల్పకాలిక అంశాలపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ కొత్త కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. `` డాక్టర్లు, లాయర్లు, విశ్రాంత ఉద్యోగులు విద్యావేత్తలు, సైకాలజిస్టులు సభ్యులుగా ఉండడంతో.. లైంగిక వేధింపులపై పారదర్శకంగా చర్చించేందుకు వీలు అవుతుంది. ఇకపై ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు వీడియోగ్రఫీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో ఆడిషన్స్ జరిగేటప్పుడు ఒక మహిళా పర్యవేక్షకురాలు ఉండేలా నిబంధనలు రూపొందించాం. కమిటీలో ‘షీ టీమ్ హాట్ లైన్’ ని కూడా ఏర్పాటు చేస్తున్నాం` అని శంకర్ పేర్కొన్నారు.
మోడలింగ్ కో-ఆర్డినేటర్స్‌కి సరైన లైసెన్సింగ్, అర్హతలు ఉండేలా చర్యలు మొదలు పెట్టామని శంకర్ తెలిపారు. సినిమా రంగంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి పలు అసోషియేషన్స్ ఉన్నట్లే మహిళా సమస్యల పరిష్కారానికి కూడా కొన్ని సంఘాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎక్కడా మీడియా నియంత్రణ గురించి మాట్లాడలేదని, మీడియా, సినీ పరిశ్రమ రెండు కలిసే ఉంటాయని, ఉండాలని ఆయన అన్నారు. `మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై చిత్ర పరిశ్రమలోని వివిధ సంస్థలకు ఇప్పటికే మార్గదర్శకాలు పంపించాం. ఉదాహరణకు విశాఖ గైడ్‌లైన్స్‌ప్రకారం కాష్ కమిటీని నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మొదలైన వారికి తగినన్ని మరుగుదొడ్లు, ఛేంజింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి. ఒక మహిళా సిబ్బంది ఉండాలి. సమాచార సాధనాల్లో భాష సక్రమంగా ఉండేలా జాగ్రత్తపడాలి` అని సూచించారు. లైంగిక వేధింపులపై ఏర్పాటు చేయనున్న ప్యానల్‌లో ‘షీ’ టీంలో ఒక డైరెక్ట్ హాట్‌లైన్ ఉంటుందని, దీనిద్వారా వేగంగా చర్యలు తీసుకొనేందుకు వీలవుతుందని వివరించారు.
Click Here For Video