Begin typing your search above and press return to search.
మా భవంతి సొంత డబ్బుతోనే .. మంచు మ్యానిఫెస్టో!
By: Tupaki Desk | 7 Oct 2021 12:30 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయి. అభ్యర్థులు నువ్వా నేనా? అంటూ పోటీకి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఎత్తుగడలతో సిద్ధమై ఘాటైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
ఇరు వర్గాలు మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ విజయం మేనిఫెస్టోను ప్రకటించింది. తమ ప్యానెల్ విజయం సాధిస్తే మా సొంత భవంతిని తన సొంత డబ్బుతో నిర్మిస్తానని మంచు విష్ణు మరోసారి ప్రకటించారు. సభ్యులందరికీ ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి సొంత ఇల్లు వచ్చేలా చేసే బాధ్యత తనదేనని ప్రామిస్ చేశారు.
అవకాశాలు లేని ఆర్టిస్టులకు `మా యాప్`ని తెస్తున్నామని ఇందులో పోర్ట్ ఫోలియో లు అప్ లోడ్ చేసి దర్శకనిర్మాతలకు రచయితలకు అందిస్తామని కూడా విష్ణు మంచు తెలిపారు. జాబ్ కమిటీ ద్వారా వారందరికీ సినిమాలు సహా OTT మాధ్యమాల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. మా సభ్యులకు వారికుటుంబ సభ్యులకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్- ఈఎస్ ఐ- హెల్త్ కార్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. పిల్లలకు కేజీ టు పీజీ వరకు విద్యాసాయం అందిస్తామన్నారు.