Begin typing your search above and press return to search.
'మా' లొల్లి ఇప్పట్లో ముగిసేలా లేదు
By: Tupaki Desk | 12 Oct 2021 6:53 AM GMTమా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అంతా నార్మల్ అవుతుంది.. మళ్లీ ఎన్నికల వరకు మా గురించిన చర్చ రాకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్నికలు జరిగిన తీరునే అనుమానిస్తున్నారు. అనసూయ గెలిచినట్లుగా ఆదివారం రాత్రి మీడియాలో కథనాలు వచ్చాయి. కాని సోమవారం అధికారికంగా ప్రకటించిన ఓట్ల లెక్కింపు అధికారిక ప్రకటన మాత్రం ఆమె ఓడి పోయినట్లుగా నిర్థారణ అయ్యింది. మొత్తానికి మా ఎన్నికలపై రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే మా కొత్త అధ్యక్షుడికి మరియు కార్యవర్గంకు మాజీ అధ్యక్షుడు అయిన శివాజీ రాజా లేఖ రాశాడు. అందులో మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న నరేష్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. 15 రోజుల్లోనే విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేశాడు. శివాజీ రాజా మరియు నరేష్ ల మద్య గత ఎన్నికల సమయంలో పోటీ జరిగింది. ఇద్దరు కూడా ఆ సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల తర్వాత శివాజీ రాజా సైలెంట్ అయ్యాడు. కాని మంచు విష్ణు గెలిచిన తర్వాత శివాజీ రాజా మళ్లీ నరేష్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
నరేష్ హయాంలో మా నిధుల గోల్ మాల్ జరిగిందని.. అదే సమయంలో మా కు సంబంధించి పలు పనుల్లో అవకతవకలు జరిగాయంటూ శివాజీ రాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఒక వేళ నరేష్ హయాంలో జరిగిన అవకతవకల గురించి విచారణ 15 రోజుల్లో జరిపించకుంటే మాత్రం తన మా సభ్యత్వంకు రాజీనామా చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తానంటూ ప్రకటించాడు. ఆయన ప్రకటన చూస్తుంటే వివాదం ఇప్పట్లో సమసి పోయేలా లేదు అనిపిస్తుంది. ముందు ముందు ఆయన చేసే వ్యాఖ్యలు.. వాటిపై మంచు విష్ణు అధ్యక్షుడిగా స్పందించే తీరు ప్రతి ఒక్కటి కూడా ఆసక్తికరంగా మారబోతుంది. ఎన్నికల్లో జరిగిన అవకతవకలు గురించి కూడా విచారణ జరగాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. బ్యాలట్ పత్రాలు కొందరు ఇంటికి తీసుకు వెళ్లారు అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మా సభ్యులు కొందరు ఎన్నికల తుది ఫలితాలను అనుమానిస్తున్నారు.
మొత్తంగా మా ఎన్నికల తర్వాత లొల్లి తగ్గుతుందని అనుకుంటే ఇప్పట్లో ఆ వ్యవహారంకు ఒక ఫుల్ స్టాప్ పడేలా లేదు అనిపిస్తుంది. ఇప్పటికే మా సభ్యులుగా ప్రకాష్ రాజ్ మరియు నాగబాబులు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వారి రాజీనామాను మంచు విష్ణు ఇంకా ఆమోదించలేదు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మా ఎన్నికల తర్వాత మంచు విష్ణు మాట్లాడుతూ చిరంజీవి గారు నాన్నకు ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ ను ఏకగ్రీవం చేద్దాం విష్ణును తప్పుకోమని చెప్పు అంటూ సూచించాడట. కాని నాన్న మాత్రం అందుకు ఒప్పుకోలేదు అన్నాడు. ఇక మోహన్ బాబు మాట్లాడుతూ నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూశారు కదా అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఎన్నికల తర్వాత కూడా మాటల మార్పిడి జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఈ వ్యవహాం ముందు ముందు మరింతగా హీట్ పెంచేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మా పెద్దలు ఈ విషయమై మొదటే సభ్యులకు వార్నింగ్ ఇచ్చి కాస్త వివాదాలను పక్కన పెట్టేలా చూస్తే పర్వాలేదు. కాని మాకేం అని వదిలేస్తే మా మళ్లీ లొల్లి ముదిరి మీడియాలో రచ్చ అయ్యే అవకాశాలు లేక పోలేదు.