Begin typing your search above and press return to search.
మా ఎన్నికల్లో మా జోరు పాలిటిక్స్... ?
By: Tupaki Desk | 2 Oct 2021 1:30 PM GMTఎన్నిక అంటేనే రాజకీయం. దానికి రంగులెన్నో ఉంటాయి. అది చిన్నదైనా పెద్దది అయినా సరే అలాగే ఉంటుంది. చిత్ర సీమకు సంబంధించిన అతి చిన్న ఎలక్షన్స్ గానే మా ని చూడాలి. కానీ ఇందులో పోటీ చేస్తోంది హీరోలు, కీలక నటులు, వెనక ఉన్నది కూడా టాప్ హీరోలు. దాంతో మా ఎన్నికలు అందరికీ ఆకట్టుకుంటున్నాయి. ఒక వైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ ఉంటే మరో వైపు మంచు విష్ణు ప్యానల్ ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగా కాంపౌండ్ మద్దతు ఉంది అన్న టాక్ ఉంది. దాన్ని బలపరచేలా మెగా బ్రదర్ నాగబాబు ఆ మధ్యన వారి తరఫున వేదికలెక్కి మాట్లాడారు. ఇక మంచు విష్ణు ప్యానల్ వెనకాల కూడా కొందరు సీనియర్లు ఉన్నారు. ఏకంగా విష్ణు అయితే బాలక్రిష్ణ ఫోన్ చేసి మద్దతు ఇచ్చారని చెప్పుకున్నారు.
ఇక మాజీ ప్రెసిడెంట్ నరేష్ అయితే మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విష్ణుని పొగిడారు కూడా. సూపర్ స్టార్ క్రిష్ణ వద్దకు విష్ణు ప్యానల్ ని తీసుకెళ్ళి మరీ నరేష్ ఆయన ఆశీస్సులు ఇప్పించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాలో మొత్తం తొమ్మిది వందల మంది మెంబర్స్ ఉన్నారని అంటున్నారు. ఇందులో గట్టిగా జనాలకు తెలిసిన వారు మోస్తరు నటులు రెండు వందల మంది దాకా ఉంటారు. మిగిలిన వారి ఓట్ల కోసమే మా లో వార్ సాగుతోంది. మరి వారి ఓటు ఎటు వైపు ఉంటుంది. ఎవరికి ఓటు చేస్తారు అన్నదే ఆసక్తికరం.
అయితే టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ బలమైనది. బయటకు వచ్చి ఈ రోజున ప్రకాష్ రాజ్ కి మద్దతుగా మెగా హీరోలు మాట్లాడకపోయినా వారి మద్దతు మాత్రం కచ్చితంగా ఆయనకే ఉంటుంది అని అంటున్నారు. దాంతో మెగా కాంపౌండ్ వర్సెస్ అదర్స్ గా ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. ఇక బాలయ్య మద్దతు మాకే అంటున్న విష్ణు నందమూరి ఫ్యామిలీ, ఆ వైపున ఉన్న వారి మద్దతు ఎంత వరకూ కూడగడతారు అన్నది కూడా చూడాలి. సూపర్ స్టార్ క్రిష్ణ ఆశీస్సులు ఉన్నాయి కనుక మహేష్ బాబు ఎటు వైపు అన్నది కూడా ఆలోచించాలి. ఇక రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు వారసుడు ప్రభాస్ ఏ వైపు ఉన్నారు అన్నది కూడా పాయింటే. మొత్తానికి మా ఎన్నికలు ఆసక్తికరమే కాదు రక్తి కట్టించే విధంగా సాగుతున్నాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే అన్ని రకాల రాజకీయాలు కూడా కలగలసిపోయాయి అన్నది చెప్పకతప్పదు. పవన్ కళ్యాణ్ వెనకేసుకువచ్చిన ప్రకాష్ రాజ్ ఒక వైపు ఉంటే విష్ణు ప్యానల్ లో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని అంటున్నారు. మరి ఇది అంతిమంగా ఏపీ రాజకీయాలను కూడా తెచ్చేసినట్లే అన్న మాట అయితే ఉంది.