Begin typing your search above and press return to search.
MAA ఎన్నికల వార్: ఈ పెద్దాళ్లున్నారే...!
By: Tupaki Desk | 1 July 2021 3:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల వార్ అంతకంతకు రచ్చవుతున్న సంగతి తెలిసిందే. పోటీలో ఉన్నవారంతా దిగ్గజాలే. అధ్యక్ష పదవి కోసం ఆరుగురు కాపుకాసుకుని కూచున్నారు. కేవలం 950 మంది సభ్యులున్న మా అసోసియేషన్ ఎన్నికలు జనరల్ ఎన్నికలనే తలపిస్తుంటే అందరూ ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఒకరిపై ఒకరు రాజకీయాలు నడిపించడం .. బురద జల్లుకోవడం.. సంఘం పరువుపోయేలా మాటా మాటా విసిరేయడం వగైరా వ్యవహారాలు మీడియా లైవ్ ల సాక్షిగా కనిపిస్తున్నాయి. ఇదంతా చోద్యం చూడటమే తప్ప అసలు సినీపెద్దలు దీనికి కట్టడి చేయరా? అన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ఎవరికి వారు సుద్ధపూసలం... మనమంతా ఒక్కటే అంటూనే రాజకీయాలు చేయడం ఒకరినొకరు తూలనాడడం కనిపిస్తోంది. ప్రతిదీ సర్వత్రా చర్చకు తావిస్తోంది.
సెప్టెంబర్ లో ఎన్నికలు అయ్యే వరకూ ఇలానే ఘర్షణ వాతావరణం కనిపిస్తే ఈలోగానే మా అసోసియేషన్ పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఇదే సన్నివేశం కనిపించింది. ఇంతకుముందు వీకే నరేష్ వర్సెస్ శివాజీ రాజా వార్ నడిచేది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు- వీకే నరేష్ ప్రభృతులు వార్ నడిపిస్తున్నారు. అయితే అన్నిటినీ చెక్ పెట్టేందుకు సహజనటి జయసుధకు ఏకగ్రీవం చేస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ దేనికీ క్లారిటీ రావడం లేదు.
మరోవైపు మా అసోసియేషన్ భవంతికి పాతికేళ్లుగా ప్రచారమే తప్ప పునాది రాయి వేసేవాళ్లే కరువయ్యారు. ఎవరికి వారు డొనేషన్లు ఇస్తామని ముందుకొస్తుంటే స్వీకరించేందుకు మా కమిటీనే లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. సినీపెద్దలు ఇంకా మా అసోసియేషన్ భవంతి నిర్మాణం కోసం ప్రభుత్వ పెద్దలనే అడగాలా? కోటీశ్వరులు తలుచుకుంటే ఎంతసేపు ఇది! అంటూ ఓ సెక్షన్ సూటిగానే నిలదీస్తోంది. మరి భవంతి నిర్మాణం అనేది ఎవరి హయాంలో మొదలవుతుందో కానీ నడిగర సంఘం భవంతిని నిర్మించిన విశాల్ కి ఉన్న గట్స్ కూడా కనిపించడం లేదని కాస్త ఎగతాళిగానే మాట్లాడుతున్నారు. మరి ఈ విమర్శలన్నిటికీ `మా` ధనికుల నుంచి సమాధానం వచ్చేదెపుడో.. అది కూడా ప్రాక్టికల్ గా కావాలి!