Begin typing your search above and press return to search.
`మా` ఎన్నికల్లో చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ పోటీ?
By: Tupaki Desk | 29 Jun 2021 3:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం మా ఎన్నికల వేడి అంతకంతకు రాజుకుంటోంది. ఒకవేళ మా ఎన్నికల బరిలోకి చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ దిగితే ఎలా ఉంటుంది? ఈ ఐడియా వచ్చింది ఎవరికి? అంటే ది గ్రేట్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీకి.
సరైన సమయంలో సరైన టైమింగుతో వెండితెరపై అలరించిన బ్రహ్మాజీ ఇప్పుడు సరైన టైమింగుతో అదిరిపోయే ఫన్ ని క్రియేట్ చేశాడు. చైనా అధ్యక్షుడే మా ఎన్నికల బరిలో దిగితే అంటూ ఓ ఫోటోని షేర్ చేయగా అది బోలెడంత ఫన్ ని జనరేట్ చేసింది.
ఎవరికీ అందని ఈ ఊహను తనదైన కామెడీ టైమింగ్ తో తెరపైకి తెచ్చాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్న జింగ్ పిన్ ని చూశారు కదా! మనోడు మాత్రం వెంటనే నమస్కారం పెట్టాడు ఇండియన్ స్టైల్లో.
జింగ్ పిన్ కనీసం మాస్క్ లేకుండా ఉంటే బ్రహ్మాజీ మాస్క్ పెట్టుకున్నాడు. కరోనా టైమ్ లో జాగ్రత్త ఇది. మొత్తానికి ఎడిటింగ్ గమ్మత్తుగానే చేశారు. ``క్యాజువల్ మీట్.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా అసోసియేషన్ ఎన్నికల గురించి చర్చించాం. జింగ్ పిన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే..`` అంటూ ఫన్నీ ఎమోజీతో ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేశారు బ్రహ్మాజీ.