Begin typing your search above and press return to search.
హీరో నాని కామెంట్లపై గుర్రుగా ఉన్నారా?
By: Tupaki Desk | 23 Sep 2021 3:30 AM GMTప్రతిసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నాయకుల మధ్య రణరంగాన్ని తలపిస్తున్నాయి. `మా` ఎన్నికల షెడ్యూల్ ప్రకటన దగ్గరి నుంచి మొదలయ్యే ఈ రచ్చ ఎన్నికల వరకూ వాడీ వేడీగా జరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. `మా` ఎన్నికలా.. లేక ఓ నియోజక వర్గంలో రెండు ప్రత్యర్థి పార్టీ మధ్య జరుగుతున్న ఎన్నికలా? అని ప్రజలు నివ్వెరపోయే స్థాయిలో `మా` ఎన్నికల తంతు ప్రతీసారి జరగడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు రాజకీయ నాయకుల తరహాలో ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం.. పోటీ పడుతున్న వారిపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఇదో తంతుగా మారింది.
ఈ సారి అక్టోబర్ 10న `మా` ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పదవీకాలం ముగిసి నెలలు గడుస్తుండటంతో ఎన్నికలు అనివార్యం అని చిరంజీవితో పాటు `మా` క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్టంరాజు కూడా తేల్చి చెప్పడంతో అక్టోబర్ 10న `మా` ఎన్నికలకు నగారా మోగింది.
ఈ ప్రకటనకు నెల రోజుల నుంచే `మా` ఎన్నికల హంగామా మొదలైంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముందుగా తాను `మా` ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు. అంతే స్పీడుతో తన ప్యానెల్ ని `సినిమా బిడ్డలు` అంటూ ప్రకటించి ఆశ్యర్యపరిచారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు వున్న కమిటీ ఏమీ చేయలేకపోయిందో.. తాను వస్తే ఏం చేస్తానో చెప్పారు. ఇదే `మా` మాజీ అధ్యక్షుడు నరేష్ కి ఆగ్రహాన్ని కలిగించేలా చేసింది.
వెంటనే తాను కూడా ప్రెస్ మీట్ పెట్టి తాము పదివిలోకి వచ్చాక ఇవి చేశామని.. అవి చేశామని... ప్రకాష్ రాజ్ పై డైరెక్ట్ గా కౌంటర్ లు వేశారు. దానికి ప్రతిగా ప్రకాష్ రాజ్ కూడా రివర్స్ కౌంటర్ లు సంధించారు. దీంతో ఇండస్ట్రీలో `మా` ఎన్నికలు పెద్ద రచ్చకు దారి తీశాయి. ఆ తరువాత మంచు విష్ణు అధ్యపదవికి పోటీకి దిగుతున్నానని.. తాను గెలిస్తే `మా` బిల్డింగ్ ని తన సొంత డబ్బులతో కట్టిస్తానని రంగంలోకి దిగడం.. ఆ వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్,.. అడ్వకేట్ సీవీఎల్ నరసింహారావు తాను కూడా తెలంగాణ వాదంతో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్టుగా ప్రకటించడం.. జీవిత.. హేమ కూడా తాము కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్టుగా ప్రకటించడంతో `మా` ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా వుంటే `మా` ఎన్నికల కోసం పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ పై ఇండైరెక్ట్ గా హీరో నాని కామెంట్‌లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తను నటించిన `టక్ జగదీష్` ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన నాని ప్రస్తుతం జరుగుతున్న `మా` ఎన్నికలపై రభస తన భావాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగు పరిశ్రమ విధుల గురించి ఏదైనా మార్చాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు ప్రతిభావంతులైన నటుడు.. `మా` ఎన్నికలకు సంబంధించి నటీనటులు ప్రెస్ మీట్లు .. టీవీల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం తనకు నచ్చలేదని దానిని వెంటనే విరమించుకోవాలని తాను కోరుతున్నానని పేర్కొన్నాడు.
నాని ఈ విషయం చెప్పిన చాలా రోజుల తర్వాత ఈ మాట చివరకు కొంత మంది పెద్దలకు చేరింది. వారు హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఆసంతృప్తిగా వున్నారట. నాని ఎన్నికల్లో పాల్గొనడం లేదు.. అంతే కాకుండా పేద `మా` సభ్యుల సంక్షేమం గురించి ఆందోళన చెందడం లేదని సీనియర్లు భావిస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నికల విధానం.. సభ్యుల ప్రచారం గురించి నాని ఎలా వ్యాఖ్యానిస్తున్నాడని మండిపడుతున్నారు.
అయితే నాని ఈ విషయంలో మాట్లాడింది సరైనదేని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే `మా` ఎన్నికలు ప్రతిసారి అనవసరమైన రాజకీయ రంగును పులుముకుంటున్నాయని తద్వారా చిత్ర పరిశ్రమ `మా` ఎన్నికలు జరిగిన ప్రతిసారి రెండుగా చీలిపోతోందని `మా`లో నటులు ఎప్పుడూ ఒక కారణం కోసం కలిసి పనిచేయరని.. అది చాలా మందికి తెలుసని.. అయితే దాన్ని బయటికి చెప్పడానికి సాహసించరని కానీత నాని మాత్రం దాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారని అభినందిస్తున్నారు. నాని తాజా వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో అనారోగ్య వాతావరణం మరోసారి బయటపడటం గమనార్హం.