Begin typing your search above and press return to search.
మా ఎన్నికలు.. రాత్రి వ్యవహారాలు కూడా ఉంటాయా?
By: Tupaki Desk | 9 Oct 2021 12:32 PM GMTమూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు గతంలో ఎప్పుడు లేని విధంగా రచ్చ రచ్చ అవుతున్నాయి. ఇంతకు ముందు మా ఎన్నికలు అంటే జనాలకు అస్సలు తెలిసేది కాదు. కాని ఈసారి ఒక రాజకీయ ఎన్నిక మాదిరిగా మీడియాలో వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. పోటీ చేస్తున్న ఇద్దరు కూడా నువ్వంటే నువ్వని.. నేనంటే నేనంటూ ఢీ అంటే ఢీ అంటున్నారు. మా అభివృద్ది నాతో సాధ్యం అంటూ ఒకరు ప్రకటిస్తే.. మా భవనం నాతోనే సాధ్యం అంటూ మరొకరు అంటున్నారు. మా సభ్యుల సంక్షేమం నా బాధ్యత నాది అంటుంటే మరొకరు ప్రతి ఒక్కరిని కలుపుకు పోయి కొత్త వారికి అవకాశం ఇస్తానంటు ముందుకు వస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు విమర్శలు కూడా పెరిగాయి.
ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ మంచు విష్ణు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే.. ప్రకాష్ రాజ్ మాత్రం తాను తెలుగు వాడిని అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మంచు విష్ణు కు అంత అనుభవం లేదు కనుక అనుభవస్తుడిని అయిన నన్ను అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవాలంటూ ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇద్దరు కూడా మా ఎన్నికలను రసవత్తరంగా మార్చారు. ఇద్దరు కూడా మా ఎన్నికల్లో గెలుపు పై ధీమాగా ఉన్నారు. ఎన్నికల ప్రకటన రాకుండానే మా సభ్యులను మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. డిన్నర్ పార్టీలు ఇచ్చి తమ మ్యానిఫెస్టోను చెప్పడం.. లంచ్ మీట్ లో తనను గెలిపిస్తే ఏం చేసేది చెప్పడం వంటిని చేశారు. మొత్తానికి ఖర్చు విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నట్లుగా మీడియా వర్గాల వారు అంటున్నారు.
రాజకీయ ఎన్నికల్లో ఎన్నికల ముందు రోజు రాత్రి డబ్బులు పంచడం చాలా చోట్ల జరుగుతుంది. మరి మా ఎన్నికల్లో ఆ విధంగా కూడా ప్రచారం జరుగనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 250 నుండి 300 మంది న్యూట్రల్ గా ఉండే సభ్యులు మరియు ఆర్థికంగా ఇబ్బంది పడే సభ్యులు ఉన్నారు. వారికి డబ్బు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసినా ఆశ్చర్యం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మా సభ్యులు మరీ అంతగా డబ్బులు తీసుకుని ఓటు వేస్తారని మాత్రం అనుకోవడం లేదు. మా ఎన్నికలు ఎలా జరుగుతాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రచ్చకు ముగింపు పలుకుతారా లేదా కొనసాగిస్తారా అనేది చూడాలి.