Begin typing your search above and press return to search.

మా` నిధి ప్ర‌తీ రూపాయికి ఓ లెక్కుంది! -జీవిత‌

By:  Tupaki Desk   |   9 Aug 2021 5:30 PM GMT
మా` నిధి ప్ర‌తీ రూపాయికి ఓ లెక్కుంది! -జీవిత‌
X
మావీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్(మా) ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్నాయి. అయితే మా లుక‌లుక‌ల‌పై కుటుంబ స‌భ్యులే మీడియా ముందు లీకులివ్వ‌డం వేడెక్కిస్తోంది. వివాదాలన్నీ నిధి చుట్టూ.. మా సొంత భ‌వంతి చుట్టూనే..

తాజాగా `మా` స‌భ్యురాలు హేమ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఇటీవ‌ల ఘాటైన‌ వ్యాఖ్య‌లు చేసారు. దీంతో ఈ వివాదం మ‌రింత ముదురుతోంది. దీనికి కౌంట‌ర్ గా అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి జీవిత రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి సీన్ లోకి ఎంట‌ర్ అయ్యారు. `మా ``కార్ఫ‌స్ ఫండ్ నుంచి ప్ర‌తీ రూపాయి స‌భ్యుల మేలు కోస‌మే ఖర్చు చేసాం. ఇప్పుడు ఎంత మొత్తం ఉంది. ఎంత ఆదాయం వ‌స్తుంది. దేనికి ఎంత ఖ‌ర్చు చేసామ‌న్న‌ది రూపాయితో స‌హా లెక్క చెబుతా. ఆ విష‌యంలో సభ్యులు ఎవ‌రైనా త‌న‌ని ప్ర‌శ్నించవ‌చ్చ‌``ని జీవిత అన్నారు.

తామంతా ఒక కుటుంబ‌మ‌ని చెబుతున్నా ఈ వివాదాలు దేనికి? మ‌రి మీరు క‌ష్ట‌ప‌డి `మా` కోసం డ‌బ్బు స‌మ‌కూర్చ వ‌చ్చు కదా! అని జీవిత‌ ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌మని అడిగింది ఎవ‌రు? న‌రేష్ తిష్ట వేసుకుని కూర్చున్నారని ఎవ‌రు అన్నారు? ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో స‌భ్యుల్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. చిరంజీవి గారు..కృష్ణంరాజు గారు ఆధ్వ‌ర్యంలో ఉన్న క్ర‌మ శిక్ష‌ణా సంఘం చెప్పే ప్ర‌తి స‌ల‌హాని..సూచ‌న‌ని తూచ త‌ప్ప‌కుండా పాటిస్తున్నాం. ఎన్నిక‌లు కూడా వారు ఎలా నిర్వ‌హించ‌మంటే అలా చేప‌డ‌తాం. ఏక‌గ్రీవం అంటే అలాగే కానిద్దాం. కాదు పోటీకి వెళ్దామంటే అలాగైనా ముందుకు వెళ్దాం. `మా `లో ఎలాంటి మోసం జ‌ర‌గ‌లేదు. మెంబ‌ర్ వెల్ఫేర్ కోస‌మే అంతా క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని జీవిత వెల్ల‌డించారు.

అలాగే తాత్క‌లిక అధ్య‌క్షుడు న‌రేష్ కూడా మా భ‌వ‌నం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. భ‌వ‌న నిర్మాణం జ‌రుగుతుంద‌ని..అదేమి పెద్ద విష‌యం కాద‌ని ఉద్ఘాటించారు. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లకు వెళ‌దాం. న‌మ్మిన వారికే స‌భ్య‌లు ఓట్లు వేస్తారు. మా గొడ‌వ‌ల్లోకి పెద్ద‌లు ఎవ‌రినీ లాగొద్దు. మ‌న స‌మ‌స్య‌ల్ని మ‌న‌మే ప‌రిష్క‌రించుకుని అంతా క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళ‌దామ‌ని న‌రేష్ ఆకాంక్షించారు. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో నువ్వా నేనా అంటూ ఆరుగురు పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

2021-23 సీజ‌న్ కోసం ఎన్నిక‌లు..

2021-23 సీజ‌న్ కోసం మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు రంజుగా సాగ‌నున్నాయి. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల మ‌ధ్య‌ వార్ ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. ఇక్క‌డ వ‌ర్గ‌పోరాటం ఎప్ప‌టికీ అంతం కాద‌ని సంకేతాలందాయి. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం.. మంచు విష్ణు వ‌ర్గం అంటూ ఇరువురి న‌డుమా పోటీ నెల‌కొంది. అలాగే జీవిత‌- హేమ‌- సీవీఎల్ త‌దిత‌రులు మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీప‌డుతుండ‌డం చూస్తుంటే ఈ ఎన్నిక‌లు ఎంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు. కేవ‌లం 950 మంది స‌భ్యుల కోసం జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు త‌ల‌దూర్చ‌డం బ‌య‌ట‌ప‌డుతోంది. కులం మ‌తం ప్రాంతం వ‌ర్గం అంటూ చాలానే సీన్ క‌నిపిస్తోంది.

నాగ‌బాబు- ముర‌ళి మోహ‌న్ -మోహ‌న్ బాబు స‌హా ఎంద‌రో దిగ్గ‌జాలు ఆరంభం మా అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత రాజేంద్ర ప్ర‌సాద్ - శివాజీరాజా- వీకే న‌రేష్ వీళ్లంతా అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టి రెండేళ్ల సీజ‌న్ చొప్పున పాలించారు. ఇక సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అన్న‌ది అటుంచితే.. మూవీ ఆర్టిస్టుల సంఘానికి సొంత బిల్డింగ్ ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని ఆర్టిస్టులు భావిస్తున్నారు. అన్ని అసోసియేష‌న్లు ఎవ‌రికి వారు సొంత భ‌వంతుల్ని నిర్మించుకుంటుంటే ప్రతిష్ఠాత్మ‌క మా అసోసియేష‌న్ కి క‌నీసం పునాది రాయి అయినా ప‌డ‌లేద‌న్న వెన‌క‌బాటుత‌నం వెక్కిరిస్తోంది. అందుకే దీనికి ప‌రిష్కారం క‌నుగొనేందుకు సినీపెద్ద‌లు బ‌రిలో దిగారు. ఇక‌పై పేద ఆర్టిస్టుల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఆగ‌కూడ‌దంటే సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌ల్ని పూర్తి చేయాల‌ని సినీపెద్ద‌లు భావించి తేదీని లాక్ చేశార‌ని తెలిసింది.