Begin typing your search above and press return to search.
మహేష్ పై కమెడియన్ వ్యాఖ్యలు...'మా' ఫైర్!
By: Tupaki Desk | 15 Sep 2018 12:26 PM GMTకాకతాళీయంగానో....కావాలని కాంట్రవర్సీ చేసి పాపులర్ కావాలనే ఉద్దేశంతోనో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను కొంతమంది విమర్శించి వార్తల్లో నిలుస్తున్నారు. తన ఉద్యమానికి ఊపు రావాలని పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చే సి సంచలనం రేపింది. ఆ ఉదంతంతో ఆమెకు పబ్లిసిటీతో పాటు నెగెటివిటీ కూడా బోనస్ గా దక్కి ఉద్యమం తప్పుదారి పట్టింది. తాజాగా - అదే తరహాలో ఓ షో లో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆ షోలో పాల్గొన్న మనోజ్....మహేష్ ను ఉద్దేశించి తోచినట్లు కామెంట్లు చేశాడు. మహేష్ బాబు హావభావాలు పలికించలేడని - స్పైడర్ సినిమాలో విలన్ ఎస్ జే సూర్య...మహేష్ కన్నా బాగా నటించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో, మనోజ్ పై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నడిగర్ సంఘానికి `మా` ఓ లేఖ కూడా రాసింది.
ఆ షోలో భాగంగా....మహేష్ పై మనోజ్ జోకులు వేశాడు. మహేష్ బాబు ఎక్స్ ప్రెషన్స్ కత్రినా కైఫ్ లా ఉంటాయని - కత్రినా కైఫ్ మేల్ వెర్షన్ మహేష్ అని సెటైర్ వేశాడు. ఆ సినిమాలో రాళ్లు కూడా మహేష్ కన్నా మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో, మనోజ్ పై మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో...మహేష్ బాబుకు,ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ మనోజ్ ఓ పోస్ట్ పెట్టాడు. తన వ్యాఖ్యలు ఆ షోలో భాగమని - వ్యక్తిగతం కావని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు , మనోజ్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి `మా` లేఖ రాసింది. ఆ వ్యాఖ్యలను ‘మా’ తీవ్రంగా ఖండిస్తోందని ‘మా’ లేఖలో పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా ఇరు ఇండస్ట్రీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని, ఈ తరహా వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆగ్రహాన్ని తెప్పించాయని తెలిపింది. ఈ వ్యవహారంపై నడిఘర్ సంఘం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరింది.