Begin typing your search above and press return to search.

MAA కొత్త అధ్యక్షుడు విష్ణు మంచు సందేశం

By:  Tupaki Desk   |   11 Oct 2021 6:30 AM GMT
MAA కొత్త అధ్యక్షుడు విష్ణు మంచు సందేశం
X
నువ్వా నేనా అంటూ హోరా హోరీగా సాగిన MAA ఎన్నికల్లో మంచు విష్ణు .. ప్ర‌త్య‌ర్థి ప్ర‌కాష్ రాజ్ పై ఘ‌న‌ విజయం సాధించారు. 2021-23 సీజ‌న్ కి MAA అధ్యక్షుడయ్యారు. విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ను 106 ఓట్ల మెజారిటీతో ఓడించాడు. విష్ణు ప్యానెల్ కూడా కఠినమైన వార్ లో అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈ ఉదయం విష్ణు ట్విట్టర్ లో తన మద్దతుదారులకు సినీ వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. నా సినిమా సోదరులు నాపై చూపిన ప్రేమ మద్దతుతో గెలిచినందుకు ఆనందంగా ఉంది. వారి ప‌ట్ల‌ నేను వినయపూర్వకంగా ఉన్నాను.. అని కొత్త అధ్య‌క్షుడైన విష్ణు ట్వీట్ చేశారు.

``MAA ఎన్నికలపై నేను ఇంకా ఏదైనా చెప్పే ముందు ఇసి సభ్యులు- జాయింట్ సెక్రటరీ మరియు- వైస్ ప్రెసిడెంట్ పోస్టులలో ఒకదానికి కౌంటింగ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాట్లాడతాను... అని తెలిపారు.

విష్ణు విజ‌యం ముందే ఊహించిన‌దే..!

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల హోరా హోరీ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ తో సాగిన హోరాహోరీ పోరులో మంచు విష్ణు గెలుపొంది అధ్య‌క్షుడిగా ఖాయ‌మైన‌ట్టు ఆదివారం 8.30పీఎం న్యూస్ అందింది. విష్ణు ప్యానెల్ నుంచి ర‌ఘుబాబు- శివ బాలాజీ త‌దిత‌రులు గెలుపొందారు. మాణిక్-హరినాథ్ బొప్ప‌న విష్ణు-ప‌సునూరి- శ్రీ‌ల‌క్ష్మి-జ‌య‌వాణి-శ‌శాంక్- పూజిత కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా గెలుపొందారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌ఘుబాబు.. ట్రెజ‌ర‌ర్ గా శివ‌బాలాజీ ఎన్నిక‌య్యారు. ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచి మంచు విష్ణు ప్యానెల్ దూకుడు ప్ర‌ద‌ర్శించినా ఒక ద‌శ‌లో ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ సభ్యుల లీడ్ పెరిగింది. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి న‌లుగురు స‌భ్యులు గెలుపొందార‌ని తొలుత స‌మాచారం అందింది. న‌టుడు శివారెడ్డి అత్య‌థిక మెజారిటీతో గెలుపొందగా.. ఇదే ప్యానెల్ నుంచి కౌశిక్- సురేష్ కొండేటి- యాంక‌ర్ అన‌సూయ గెలుపొందారు.

నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివ‌బాలాజీ గెలుపొందాడు. శివ‌బాలాజీకి 316 ఓట్లు పోల‌వ్వ‌గా.. నాగినీడుకి 284 ఓట్లు పోల‌య్యాయి. జీవిత రాజ‌శేఖ‌ర్ పై ర‌ఘుబాబు 7 ఓట్ల తేడాతో గెలిచి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పొజిష‌న్ ఖాయం చేసుకున్నారు.

101 ఓట్ల ఘ‌న‌మైన మెజారిటీ

ఉత్కంఠ పోరులో మా అధ్య‌క్ష ప‌ద‌వికి పొటీ చేసిన హీరో మంచు విష్ణు ప్ర‌త్య‌ర్థి ప్ర‌కాష్ రాజ్ పై 101 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. మంచు విష్ణుకు 385 ఓట్లు రాగా... ప్ర‌కాష్ రాజ్ కు 274 ఓట్లు పోల‌య్యాయి. ఇదిలా వుంటే ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడిగా ఓట‌మిపాలైనా అత‌ని ప్యానెల్ నుంచి ప‌లువురు అత్య‌ధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించ‌డం చాలా మందికి ఆర్చర్యాన్ని క‌లిగించింది. మెగా కాంపౌండ్ మ‌ద్ధ‌తు ఉన్న ప్ర‌కాష్ రాజ్ ఓట‌మి జీర్ణించుకోలేనిదిగా చ‌ర్చ‌కొచ్చింది.