Begin typing your search above and press return to search.

క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పుతున్న MAA అధ్య‌క్ష ప‌ద‌వి

By:  Tupaki Desk   |   30 July 2021 7:30 AM GMT
క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పుతున్న MAA అధ్య‌క్ష ప‌ద‌వి
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్ష ప‌ద‌విపై ప‌లువురు కన్నేసిన సంగ‌తి తెలిసిందే. ఆరుగురు స‌భ్యులు ఈసారి ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అందులో ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు వార్ పైనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ ఇద్ద‌రూ ఈసారి ఎన్నిక‌ల్లో నువ్వా నేనా? అంటూ పోటీప‌డ‌నున్నారు. తాజాగా కృష్ణం రాజు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన వ‌ర్చువ‌ల్ మీటింగ్ లో మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌రిగేందుకు అవ‌కాశం ఉంద‌ని క్లారిటీ వ‌చ్చింది. ఆగ‌స్టులో జ‌ర‌గ‌నున్న జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ లో దీనిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రానుంది.

ఈ నేప‌థ్యంలో ఇన్నాళ్లు ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డాల‌ని ఉవ్విళ్లూరిన ప్ర‌కాష్ రాజ్ లో ఉత్సాహం రెట్టింపైంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మునుప‌టిలానే ఇక‌పైనా ఆయ‌న జోరుగా ప్ర‌చారం చేస్తారు. ఇత‌రుల కంటే తాను ఒక మెట్టు పైనే ఉన్నాన‌ని నిరూపించే ప్ర‌య‌త్నాల‌లో ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా ఆయ‌న ఇటీవ‌ల సినిమా వేడుక‌లకు ముఖ్య అతిథిగా హాజ‌రై అంద‌రినీ క‌లుపుకుపోతున్నారు. అంద‌రి వాడు కాడు! అన్న అప‌వాదును చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న విల‌క్ష‌ణ న‌టుడుని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొత్తానికి మా ప‌ద‌వి ఆయ‌న‌కు కూడా క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పిస్తోందంటూ కొంద‌రు పంచ్ లు వేస్తున్నారు. అస‌లు త‌న సినిమాల ఫంక్ష‌న్ల‌కే అటెండ్ కాని ప్ర‌కాష్ రాజ్ ఇప్పుడిలా అన్ని వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. అతిధిగా వ‌చ్చి సినిమాల‌కు ప్ర‌మోష‌న్ చేస్తున్నారు! అంటూ సెటైర్లు వేస్తున్నారు కొంద‌రు.

2021-23 సీజ‌న్ కి జ‌ర‌గ‌నున్న‌ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎంఐఏ) అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి సెప్టెంబ‌ర్ 2021 నుంచి సెప్టెంబ‌ర్ 2023 వ‌ర‌కూ అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగాల‌ని ఆయ‌న క‌ల‌లు గంటున్నారు. త‌న లైఫ్ లో ఎన్న‌డూ లేని విధంగా శ్వేధం చిందిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్. ఆయ‌న త‌న వ‌ర్గం కోసం ఇటీవ‌ల ఫిలింన‌గ‌ర్ లో సొంతంగా ఆఫీస్ ని ఏర్పాటు చేసుకున్నారు. అక్క‌డే భేటీలు సాగిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. మ‌రోవైపు పూరి జ‌గ‌న్నాథ్ కేవ్ లోనూ కొన్ని మీటింగుల‌తో అంద‌రినీ స‌మీక‌రించార‌ని కూడా గుస‌గుస‌లు ఇంతకుముందు వేడెక్కించాయి.

అయితే మంచు విష్ణు నుంచి అత‌డికి సెగ త‌ప్ప‌ద‌ని అంచ‌నా. విష్ణు నుండి ప్ర‌కాష్ రాజ్ గట్టి పోటీని ఎదుర్కోనున్నాడు. ప్ర‌కాష్ రాజ్ త‌న ఒరిజినాలిటీని త‌న ఇన్న‌ర్ భావాలను నియంత్రిస్తున్నాడు. అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడ‌న్న గుస‌గుస వైర‌ల్ గా మారింది.

జైలుకి వెళ్లిన‌ది ఎవ‌రో ఎన్నిక‌ల ముందే క్లారిటీ?

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ప్ర‌కాష్ రాజ్ అండ్ టీమ్ పై మంచు విష్ణు `జైలు` వ్యాఖ్య‌లు ఇంత‌కుముందు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌ర్థి ప్రకాష్ రాజ్ పైనా ఇండ‌స్ట్రీలో కొంద‌రిపైనా ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేసారు. గ‌తంలో జైలు కెళ్లాల్సిన వాళ్ల‌ను కాపాడామ‌ని .. జైలుకెళ్లాల్సిన వాళ్లు శ్రుతిమించి మాట్లాడుతున్నారు! అంటూ ప‌రోక్షంగా మంచు విష్ణు విసిరిన పంచ్ లు వైర‌ల్ అయ్యాయి. ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఊచ‌లు లెక్క బెట్ట‌కుండా బ‌య‌ట ఉన్నారంటే ఎవ‌రి వ‌ల్ల అన్న‌ది వాళ్ల‌నే అడ‌గాలి. పోలీస్ స్టేష‌న్ లో తెల్ల‌వారి 4 గం.ల‌కు కూచోబెడితే `అదొక మిస్ అండ‌ర్ స్టాండింగ్` అంటూ బ‌య‌ట‌కి తీసుకొచ్చాం. వారి పేర్ల‌ను మాత్రం చెప్పను అని మంచు విష్ణు టాప్ సీక్రెట్ ని రివీల్ చేయ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్‌యంలో విష్ణు కామెంట్లు మ‌రింత‌గా వేడెక్కిస్తాయ‌నే భావిస్తున్నారు.