Begin typing your search above and press return to search.
'మా' ఆధిపత్య పోరు మళ్లీ మొదటికి!
By: Tupaki Desk | 16 March 2019 12:31 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో అసలేం జరుగుతోంది? ఆ ఇరువురి మధ్యా గొడవ సద్ధుమణగలేదా? ఎలక్షన్ అయ్యింది. కొత్త అధ్యక్షుడిగా నరేష్ గెలిచారు. అయినా ఇంకా ఎందుకీ చెదురుముదురు గొడవలు? అసలేం జరుగుతోంది? మరోసారి `మా` పరువు మర్యాదల్ని గంగలో కలిపేయబోతున్నారా? అంటే... సగటు ఆర్టిస్టు ని ప్రశ్నిస్తే అవును అదే జరుగుతోందని అంటున్నారు.
2018లో మా అధ్యక్షుడు శివాజీ రాజా.. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నరేష్ మధ్య అస్సలు పొసగడం లేదని మరోమారు నిరూపణ అయ్యింది. మా ఎన్నికల్లో మరోమారు ఆ ఇద్దరి మధ్యా వ్యక్తిగత కక్షలు బయటపడ్డాయి. ఇప్పుడు నరేష్ గెలిచి పదవి చేపడతానంటే శివాజీ రాజా వైపు నుంచి వ్యతిరేకత నెలకొందట. నరేష్ తో పాటు - నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 22న చేపట్టాలని ప్లాన్ చేస్తే అందుకు శివాజీ రాజా వ్యతిరేకిస్తున్నారట. నా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉంది.. కొత్త బాడీ అప్పటి వరకు మా కుర్చీలో ఎవరూ కూర్చో వద్దు. ఒకవేళ అలా జరిగితే కోర్టుకు వెళ్తానని శివాజీ రాజా ఫోన్ చేసి బెదిరించారని.. నరేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కృష్ణమోహన్ అధ్యక్షతన నేడు ఫిలింఛాంబర్ లో జరిగిన సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ... ``మా లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి మా గుట్టు బయట పడకుండా అందరినీ కలుపుకు పోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని వర్క్ చేయకుండా వెనక్కి లాగుతున్నారు. ఇండస్ట్రీ పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈ 22న మంచి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం.. శివాజీ రాజా నా పదవీకాలం 31 వరకు ఉంది అప్పటి వరకు ఎవరూ మా కుర్చీ లో కూర్చో వద్దు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము చేయాల్సిన పనులు చాలా వున్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం`` అన్నారు. ఈ కార్యక్రంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు. తాజా సన్నివేశాన్ని బట్టి మరోమారు మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్దల వద్ద పంచాయితీ తప్పదన్నమాట!!