Begin typing your search above and press return to search.
రౌడీగారికి తప్పడం లేదా?
By: Tupaki Desk | 28 Oct 2019 5:30 PM GMTహీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సాధించిన విజయ్ దేవరకొండ ఈమధ్యే నిర్మాతగా మారి కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' ను నిర్మించిన సంగతి తెలిసిందే. షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో నిర్మించడంతో విజయ్ సేఫ్ జోన్ లో ఉన్నాడని ఇప్పటికే టాక్ ఉంది. సినిమా థియేట్రికల్ రైట్స్ అవుట్ రైట్ గా అమ్మడంతో పెట్టుబడి దాదాపుగా వెనక్కు వచ్చిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే 'మీకు మాత్రమే చెప్తా' శాటిలైట్ రైట్స్ ను మాటీవీ రెండు కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందట. ఈ సినిమా డీల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ మొదట ఈ డీల్ సెట్ చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారితో సిఫార్సు చేయించాడని.. ఆ తర్వాత విజయ్ కూడా డైరెక్ట్ గా వారిని ఎప్రోచ్ అయ్యి రైట్స్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడని.. ఆ తర్వాతే డీల్ క్లోజ్ అయిందనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఆ రేంజ్ లో ప్రయత్నించినా కూడా సినిమా రైట్స్ కు పెద్దగా ధర పలకకపోవడం చూస్తుంటే విజయ్ తనకుండే క్రేజ్ తనే తగ్గించుకుంటున్నట్టుగా ఉందని అంటున్నారు. ఈ ప్రయత్నాలు చేయకపోయినా శాటిలైట్ రైట్స్ రెండు కోట్లకు అటూ ఇటూగానే అమ్ముడుపోయిఉండేదని ఇంత కష్టపడాల్సిన పని లేదనే అంటున్నారు. మరి విజయ్ అంత కష్టపడడం ఎందుకో మరి.