Begin typing your search above and press return to search.
'మా'ర్పు కోసం 80 మందిపై వేటు
By: Tupaki Desk | 29 Jun 2017 4:58 AM GMTఒక్కసారిగా పెద్ద సంఖ్యలలో ఉద్యోగాలు తీసేయడం ఇప్పుడు ఐటి శాఖలోనే కాదు ప్రతి రంగంలోనూ జరుగుతుంది. ఒక్కో రంగంలో ఒక్కో కారణాలు ఉంటాయి అనుకోండి.ఇండస్ట్రిలో మార్పులు వస్తాయి, కంపెనీలో యాజమాన్యం కూడా మారుతుంది దానికి తగట్టు కంపెనీ పనులు చేసే విధానం కూడా మారుతుంది. ఈ క్రమంలో పాత వారికి పోటీకి కొత్త వారు వస్తారు . సాధ్యాసాధ్యాలు అన్నీ ఆలోచించుకొని ఎవరికి వేటు ఎవరికి చోటు అనే నిర్ణయం కూడా తీసుకుంటారు.
తెలుగు ఎంటర్టైన్మెంట్ చానెల్స్ లో టాప్ ర్యాంక్ లో ఉన్న ‘మా టివి’ ఇప్పుడు ‘స్టార్ మా’ టివి గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ‘స్టార్ మా’ టివి ఒక్కసారిగా 80 మంది పాత ఉద్యోగస్తులను తొలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 7-8 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళని ఉన్నపలంగా జాబ్ నుండి విరమించుకోమని చెప్పారంట. మా టివిని తీసుకున్నప్పట్టి నుండి ఈ పని జరుగుతుంది అని ముందే కొంతమంది ఊహించి.. జంప్ అయిపోయినవారూ లేకపోలేదు. కొత్త యాజమాన్యం తగ్గట్టుగా వాళ్ళు కొత్త వాళ్ళని నియమించుకోబోతున్నారుట. స్టార్ మా టివి భాధ్యతలు చేపట్టినప్పుడు ఈ విషయం ఆ పాత ఉద్యోగస్తులకు చెప్పారని, ఇప్పుడు ఆ గడువు పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
స్టార్ మా గా మారిన తరువాత ఆ చానెల్లో పెద్ద షో అంటే అది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అదికూడా పెద్ద హిట్ ఏమి కాలేదు. ఇప్పుడు స్టార్ మా క్రియేటివ్ పీపుల్ కోసం వెతుకుతుందిని దాని కోసం వేట మొదలుపెట్టారుని అంటున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ పని వేటు కొత్త వాళ్ళకు పిలుపులు రెండు ఒకే సారి జరుగుతున్నాయట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/