Begin typing your search above and press return to search.

'మా'వారు.. రామ్మా శ్రీరెడ్డి అనేశారు

By:  Tupaki Desk   |   12 April 2018 4:43 PM GMT
మావారు.. రామ్మా శ్రీరెడ్డి అనేశారు
X
ఫిలిం ఛాంబర్ హాల్ ముందు శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న ప్రదర్శన లేదా నిరసన.. టాలీవుడ్ ను కుదిపేస్తున్న మాట వాస్తవం. శ్రీరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ 'మా' సభ్యత్వం ఇచ్చేది లేదని.. ఆమెతో నటించే 'మా' సభ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించాడు అధ్యక్షుడు శివాజీ రాజా.

ఇప్పుడు మా అసోసియేషన్ దిగొచ్చింది. శ్రీరెడ్డి విషయంలో తాము చేసిన పని కరెక్ట్ కాదని ఒప్పేసుకున్నాడు శివాజీ రాజా. ఆరోజున ఆమె చేసిన పని కారణంగా ఆవేశంతో అలా మాట్లాడమన్న మా అధ్యక్షుడు.. ఆమెను తమలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. 'మా లాగే ఎంతో మంది ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని.. రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అవకాశాలు ఇప్పించలేదు. దర్శకులు.. నిర్మాతలు ఛాన్సులు ఇస్తారు.. మేం తెలుగు వాళ్లకు ముఖ్యంగా సీనియర్లకు అవకాశాలు ఇప్పించమని చెప్పాం. నేను.. నరేష్.. శ్రీకాంత్ వంటి అందరికీ ఛాన్సులు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది' అన్నాడు శివాజీ రాజా.

'తేజ గారు ఫోన్ చేసి.. రెండు ఛాన్సులు శ్రీరెడ్డి గారికి ఇస్తాను అంటే.. మీరు ఇవ్వండి ఆవిడ మా కుటుంబంలో ఓ వ్యక్తి.. చిన్న తప్పు చేసింది కదా అని పగలు పెట్టుకోము. మా ఆర్టిస్టు ఇలా చేసిందని బాధ పడిన మాట నిజం. మా పెద్దలు ఇవాళ మాతో మాట్లాడుతూ.. 900 మంది ఆమెతో నటించకూడదు అన్న మాటను వెనక్కు తీసుకోమని చెప్పినప్పుడు సంతోషించాం. ఆమె ఫిలిం ఇండస్ట్రీపై కాన్సంట్రేట్ చేయాలని.. మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను అన్నయ్యా అనుకో.. నా దగ్గరకు వచ్చి వట్టి చేతులతో ఎవరూ వెళ్లలేదు. ఏ సహాయం కావాలన్నా చేస్తానని చెప్పాను' అన్నాడు శివాజీ రాజా.

'శ్రీరెడ్డి గారూ.. రామ్మా.. మాలో కలువు.. మీతో మేమందరం కలిసి యాక్ట్ చేస్తాం' అంటూ తన స్పీచ్ కు ఫినిషింగ్ ఇచ్చాడు శివాజీ రాజా. మా సభ్యత్వం ఆమెకు ఇచ్చే విషయంలో నిబంధనలకు అనుగుణంగానే అన్నీ జరుగుతాయని చెప్పాడు.