Begin typing your search above and press return to search.

‘మా’ పోలింగ్ షురూ.. ఏర్పాట్లు ఎంత భారీగా అంటే?

By:  Tupaki Desk   |   10 Oct 2021 4:30 AM GMT
‘మా’ పోలింగ్ షురూ.. ఏర్పాట్లు ఎంత భారీగా అంటే?
X
పోటాపోటీగా.. నువ్వా నేనా అన్నట్లు.. ఇప్పటివరకు ఎప్పుడూ జరగనంత వేడి వాతావరణంలో 'మా' ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ అయ్యింది. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఇరుప్యానళ్లకుచెందిన ప్రముఖులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. మొత్తం 925 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 883 మందికి మాత్రమే ఓటుహక్కు ఉంది. వీరిలో 500లకు పైనే ఓటు వేస్తారని ప్రచారం జరుగుతున్నా.. ప్రస్తుతం సాగుతున్న పోటాపోటీ పరిస్థితుల్లో ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే జరిగే పోలింగ్ ప్రక్రియ.. అనంతరం రెండు గంటలు ఆగిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు షురూ చేశారు. తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో ఈ పోలింగ్ ను నిర్వహించనున్నారు. దాదాపు 50 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడుతున్నాయి. ఒకదానికి ప్రకాశ్ రాజ్ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతుంటే.. మరోదానికి మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ టీంలో.. శ్రీకాంత్.. జీవిత.. ఉత్తేజ్.. బెనర్జీ.. హేమ.. నాగినీడు.. అనితా చైదరిలతో పాటు మరో 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఇక.. మంచు విష్ణు ప్యానల్ విషయానికి వస్తే.. రఘుబాబు.. బాబు మోహన్.. మాదాల రవి.. థర్టీ ఇయర్స్ ప్రధ్వీ.. శివబాలాజీ.. కరాటే కల్యాణి.. గౌతమ్ రాజులతో పాటు పద్దెనిమిది మంది ఎగ్జిక్యుటివ్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు.

రెండేళ్లకు ఒకసారి జరిగే 'మా' ఎన్ని్ల్లో ప్రతి ఒక్క ఓటరు మొత్తం 26 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియలో తనకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానల్ లో ఉన్నారు? ఏ పదవికి పోటీ చేస్తున్నారో చూసుకొని ఓటు వేసే వీలుంది. ఈ క్రమంలో ఒక్కో స్థానానికి ఒక్కో ప్యానల్ లోని వారికి ఓటు వేసినా ఇబ్బంది ఉండదు. కాకుంటే.. ఒకే ప్యానల్ కు చెందిన అందరికి ఓటు వేసతే మరెలాంటి సమస్యా ఉండదంటున్నారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగు గంటలకు మొదలయ్యాక.. తొలుత ఈసీ మెంబర్ల ఫలితాలు వెల్లడిస్తారు. చివరకు 'మా' అధ్యక్షుడి ఫలితాన్ని ప్రకటించనున్నారు.