Begin typing your search above and press return to search.
#మాయ మాయ లిరిక్.. హరికథ విన్నంత హాయిగా..!!
By: Tupaki Desk | 12 Aug 2021 10:03 AM GMTహీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం `రాజ రాజ చోర` టీజర్ వినూత్న కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ``మాయా మాయ..`` అంటూ సాగే ఈ ప్రత్యేకమైన రొమాంటిక్ నంబర్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది.
ఇది రెగ్యులర్ మెలోడీ కాదు.. కానీ లీడ్ పెయిర్ మధ్య ప్రేమను కాస్త కామిక్ టచ్ తో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. హాయిగా హరికథ విన్నట్టుంది ఈ ప్రయోగం!.. వివేక్ సాగర్ విభిన్నమైన ట్యూన్ తో కొత్తగా ప్రయత్నించారు. అనురాగ్ కులకర్ణి తన ఉత్తమమైన పాటతో అలరించారు. సేనపతి భరద్వాజ పాత్రుడు సాహిత్యం కూడా బాగుంది. ఇలాంటి ప్రయోగాలు అన్నివేళలా వెల్ కం చెబుతారు యూత్. ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుందనడంలో సందేహమేం లేదు. పూర్తి సినిమాలో మాయ మాయ విజువల్ గానూ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.
శ్రీ విష్ణు- మేఘా ఆకాష్ మధ్య కెమిస్ట్రీ పాటలో బాగా కుదిరింది. మేఘ ఈ చిత్రంలో ఆరాధ్యగా కనిపించనుంది. రవిబాబు- తనికెళ్ల భరణి- సునైనా తదితర తారాగణం నటిస్తున్నారు.. హసిత్ గోలి ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. టిజి విశ్వ ప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. లిరికల్ వీడియో క్రియేటివ్ గా ఆకట్టుకుంది. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ అందిస్తున్నారు. కృష్ణ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ కాగా.. జీ మ్యూజిక్ సంగీతాన్ని విడుదల చేసింది.