Begin typing your search above and press return to search.
RRR ఎమోషన్స్ పీక్స్ అంటూ కితాబు
By: Tupaki Desk | 24 Feb 2020 1:30 AM GMTబాహుబలి చిత్రానికి తమిళ మాటలు రాసి.. కాళకేయుల కిలికి భాష సృష్టికర్తగా పేరు తెచ్చుకున్నారు మదన్ కార్కి. ఈ యంగ్ ట్యాలెంట్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ గురించి ఏమంటున్నారు? అంటే...
బాహుబలిని మించి ఆర్.ఆర్.ఆర్ ఉంటుంది అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఆ సినిమాని మించిన ఎమోషన్స్ ని ఈ చిత్రంలో చూస్తారని అన్నారు. ఒక సంచలన విజయం తర్వాత ఒత్తిడిలోనూ అంచనాల్ని అందుకునేలా తెరకెక్కిస్తున్నారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బాహుబలిని మించిన భారీతనం.. ఎన్టీఆర్- రామ్ చరణ్ పాత్రలు హైలైట్ గా ఉంటాయని తెలిపారు.
బాహుబలి తరహాలోనే అన్ని భాషలకు రుచించే చిత్రమిది అని కితాబిచ్చేశారు మదన్. అయితే పాన్ ఇండియా కేటగిరీలో రిలీజైన రీసెంట్ సినిమాలు సాహో- సైరా రిజల్ట్ కొంత నిరాశపరిచింది. సాహో హిందీ భాషలో అద్భుత విజయం సాధించి సౌత్ లో చతికిలబడింది. సైరా తెలుగు రాష్ట్రాల్లో గొప్ప విజయం సాధించి ఉత్తరాదిన చతికిలబడింది. అలా కాకుండా బాహుబలి రేంజులోనే ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటేనే సంతృప్తికరమైన ఫలితం దక్కినట్టు. జక్కన్న రేంజు వేరే అని ప్రూవ్ అవ్వాలంటే ఆర్.ఆర్.ఆర్ తో అసాధారణ ఫీట్ వేయాల్సిందే.