Begin typing your search above and press return to search.
రేస్ గుర్రం విలన్ రియల్ ప్రమాణం
By: Tupaki Desk | 20 Jun 2019 6:30 AM GMTఅల్లు అర్జున్ రేస్ గుర్రం సినిమాలో మద్దాలి శివా రెడ్డిగా విశ్వరూపం చూపించిన విలన్ రవి కిషన్ గుర్తున్నాడుగా. దాని తర్వాతే సౌత్ లో అతని రేంజ్ బాగా పెరిగిపోయింది. చాలా ఆఫర్స్ వచ్చాయి. పేరు తీసుకొచ్చాయి. వాటిలో రాజకీయ నాయకుడిగా ఎక్కువసార్లు నటించిన రవి కిషన్ ఇప్పుడు నిజంగానే ఎంపి అయ్యాడు. నిన్న లోక్ సభలో అతని ప్రమాణ స్వీకారం చూసినవాళ్లకు పాత సన్నివేశాలు గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు.
అంతా ఇంతా కాదు ఏకంగా 2 లక్షలకు పైగా మెజారిటీ ఓట్లతో బిజెపి తరఫున గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన రవి కిషన్ కు ఇప్పుడు చాలా బాద్యతలు ఉన్నాయి. ఒకపక్క కమిట్ అయిన సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూనే పార్టీ పరంగా ఇమేజ్ చెడిపోకుండా పనులు చేసి జనాల ఆదరణ పొందాల్సి ఉంటుంది ఇలా మొత్తానికి రీల్ నుంచి రియల్ ఎంపి దాకా రవి కిషన్ ప్రస్థానం కొనసాగింది.
ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కృష్ణంరాజు - శత్రుఘ్న సిన్హా - జయప్రద - కృష్ణ - మోహన్ బాబు తదితరులు ఎందరో వెండితెర నుంచి ఇలా పార్లమెంట్ దాకా వెళ్ళినవాళ్ళే. అయితే రవి కిషన్ చాలా భారీ ఆధిక్యంతో గెలవడం చూస్తే జనం అతని మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారనిపిస్తోంది. ఒకేసారి నాలుగైదు బాషలలో నటిస్తున్న రవి కిషన్ ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. ముందు ముందు నిర్మాతలకు దొరకడం కూడా కష్టంగానే ఉంది