Begin typing your search above and press return to search.
వర్మ స్పందనపై నిప్పులు చెరిగిన మద్దినేని
By: Tupaki Desk | 17 Nov 2017 7:51 AM GMTనంది అవార్డుల ప్రకటనపై మొదలైన వివాదం అంతకంతకూ ముదురుతోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రతి అంశంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నంది అవార్డుల్ని ప్రకటించిన టీంకు అస్కార్ అవార్డు ఇవ్వాలని.. ఇంత బాగా అవార్డులు ఇచ్చిన వారిని కచ్ఛితంగా సత్కారం చేయాలంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు చేశారు.
దీనిపై దర్శకుడు మద్దినేని రమేశ్ బాబు తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. నంది అవార్డులపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన దర్శక నిర్మాతలపైనా సెటైర్లు వేశారు. ఫేస్ బుక్ ద్వారా తన అభిప్రాయాన్ని ప్రకటించిన మద్దినేని వర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఫేస్ బుక్ లో వర్మతో పాటు.. నంది అవార్డులను విమర్శించిన వారిపై మద్దినేని చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. (కొన్ని ప్రచురణకు వీల్లేని పదాల్ని మినహాయించి ఇవ్వటం జరిగింది)
నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది? నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా?
ఈ సమాజం మీద నాకు బాద్యత లేదని.. కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిన నీకు నంది అవార్డ్స్ మీద మాత్రం బాద్యత గౌరవం వచ్చాయా?
తెలుగుజాతి ఖర్మ ... నిజాయితీగా పనిచేసిన మా 2016 కమిటీ గురించి మాట్లాడితే ఒప్పుకోం. దేశంలో ఇన్నిరకాల జాఢ్యాలు.. పెడధోరణులు.. వ్యత్యాసాలు.. అంటరానితనాలు ఉంటే కనపడవు. కోట్లకు కోట్లు నిర్మాతల సొమ్ము తింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించిన నీవా మాట్లాడేది?
ప్రైవేటు సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీది. ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబడ్డార్. బక్కగాళ్లకి.. బలుపుగాళ్లకి.. బఫూన్లకి ఇక్కడెవ్వరూ భయపడేవారు లేరు. ఖబడ్డార్.. మీ తోక ఊపుడు పిల్లల దగ్గర చూపించండి.. పులుల దగ్గర కాదు.