Begin typing your search above and press return to search.
బండరాయి మీద పడి ఉంటే.. హాటీ బెంబేలు
By: Tupaki Desk | 20 Sep 2019 1:30 AM GMTఒకటో అంతస్తు.. రెండో అంతస్తు కాదు.. ఏకంగా 11వ అంతస్తు నుంచి ఒక బండరాయి జారి పడింది. అది కాస్తా నేరుగా ఆ హీరోయిన్ కార్ పై పడింది. ఈ ఘటనలో ఎవరికేమైంది? అంటే.. ఎవరికీ ఏమీ కాలేదు కానీ.. ఆల్మోస్ట్ ఆ ఘటనతో నిర్ఘాంతపోవడం సదరు యువకథానాయిక వంతు అయ్యింది. ఆ రాయి నేరుగా వచ్చి నెత్తి పై పడి ఉంటే ఏమయ్యేదో ఊహింంచేందుకే భయం వేస్తోంది కదూ? ఇదీ ముంబై మెట్రో నిర్వాకం.
మెట్రోల్లో దీర్ఘ కాలం నిర్మాణాలు సాగుతూనే ఉంటాయి. అవి ఎన్నటికీ పూర్తి కావు. ఈలోగానే రోడ్లపై వెళ్లే వాళ్లు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. యూటర్నులు.. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటూ హైరానా పడాల్సి ఉంటుంది. అలా ముంబైలోని జుహూ వైపు వెళుతున్న యువకథానాయిక మైనీరాయ్ కార్ ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిందట. కార్ వెళ్లే లోపే 11 వ అంతస్తునుంచి ఓ రాయి జారి కార్ పై పడింది. దీంతో మౌనీ బిత్తరపోయిందట. కార్ లో వెళుతున్న తనకు ఏమీ కాలేదు కానీ.. కార్ అద్దాలు పగిలాయి. ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన మౌనీ దీనిపై చాలానే సీరియస్ అయ్యింది.
జుహు సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో కారును ఆపాను. ఇంతలో ఉన్నట్టుండి ఓ పెద్ద బండరాయి నా కారుపై పడింది. 11 అంతస్తులపై నుంచి పడింది!! అంటూ మౌనీ ట్వీట్ చేసింది. మొత్తానికి పెద్ద ప్రమాదమే గట్టెక్కింది. దారి వెంట చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. ఒకవేళ నా కారుపైన కాకుండా.. ఎవరిపై అయినా పడి ఉంటే పరిస్థితి? అంటూ ప్రశ్నించింది. దీనిని మానవతప్పిదంగానే పరిగణించాలి. మరి ముంబై మెట్రో దీనికి ఏమని సమాధానమిస్తుందో చూడాలి.