Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' కోసం వీఎఫ్ ఎక్స్ తో మాయ చేశారట
By: Tupaki Desk | 22 Jan 2022 6:44 AM GMTవున్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించడం వీఎఫ్ ఎక్స్ ప్రత్యేకత. ఇప్పడు చాలా వరకు భారీ చిత్రాలకు అవసరం వున్నా లేకపోయినా వీఎఫ్ ఎక్స్ ని వాడేస్తున్నారు.
హీరో ముఖంపై ముడతలు కనిపించకుండా చేయాలన్నా.. హీరో మరింత యంగ్ గా కనిపించాలన్నా మన వాళ్లకు లభించిన ఏకైక సాధనం వీఎఫ్ ఎక్స్. కొన్ని సినిమాలకు మరీ ఎక్కువగా వాడేస్తున్నారు. కొన్ని సినిమాలకైతే దీని ద్వారా అద్భుతాలు సృష్టిస్తూ మాయ చేసేస్తున్నారు.
అలాంటి మాయే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్` కోసం చేశారట మేకర్స్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విధికి, ప్రేమకు మధ్య నలిగిపోయిన ఓ జంట కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సరికొత్త నేపథ్యంలో తెరకెక్కించారు.
ఈ మూవీ అంతా సవ్యంగా వుంటే జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ ఓమిక్రాన్, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని మేకర్స్ వాయిదా వేశారు. ఇదిలా వుంటే గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ మూవీ కోసం వీఎఫ్ ఎక్స్ తో మేకర్స్ మాయ చేశారట.
అదేంటంటే ఈ చిత్రంలో ప్రభాస్ - పూజా హెగ్డేల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాల్సి వుందట. ఈ పాటకు సంబంధించిన విజువల్స్ కొన్ని ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో చూపించి సర్ ప్రైజ్ చేశారు.
అయితే ఈ పాటని పూర్తి చేయాలని భావించిన సమయంలో పూజా హెగ్డే డేట్స్ అడ్జెస్ట్ కాలేదట. అంతే కాకుండా ఈ తరహా పాటలో నటించడం ప్రభాస్ కు కొత్త కావడంతో చేసేది లేక వీఎఫ్ ఎక్స్ లో ఈ పాటని పూర్తి చేశారట.
చాలా వరకు పూజా డూప్ సహాయంతో ఈ పాటని పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే క్లోజప్ షాట్స్ లో మాత్రం పూజా, ప్రభాస్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ విషయం తెలిసిన వాళ్లంతా వీఎఫ్ ఎక్స్ తో `రాధేశ్యామ్` టీమ్ మాయ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇంత భారీ చిత్రం కోసం హీరో, హీరోయిన్ లు లేకుండా ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేయడం నిజంగా వండర్ అని ఇప్పుడు ఇండస్ట్రీలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
ఇంతగా సంచలనం సృష్టిస్తున్న ఈ రొమాంటిక్ సాంగ్ రేపు స్క్రీన్ పై ప్రేక్షకులని ఎంత వరకు ఆశ్చర్యపరుస్తుందో చూడాలి.
కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ మార్చి లేదా, ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు వున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వాయిదా పడిన `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ని మేకర్స్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.