Begin typing your search above and press return to search.

మహేష్ సినిమా కోసం బాహుబలి రైటర్

By:  Tupaki Desk   |   12 July 2016 10:23 PM IST
మహేష్ సినిమా కోసం బాహుబలి రైటర్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో క్రేజీ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీయనున్ని ద్వి భాషా చిత్రం.. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈనెల 29 నుంచి మహేష్ సినిమాకి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పుడీ మూవీ కోసం అదనపు ఆకర్షణలు అనేకం జతవుతున్నాయి. ఇప్పుడు బాహుబలి1 మూవీకి పని చేసిన ఓ రైటర్ ని సూపర్ స్టార్ సినిమా కోసం తీసుకురావడం విశేషం.

కార్కీ అనే రైటర్ మహేష్-మురుగ కాంబినేషన్ లో రానున్న మూవీ కోసం వర్క్ చేయనున్నాడు. ఈయన మహేష్ కోసం ఇంట్రడక్షన్ సాంగ్స్ ను రాయనున్నట్లు తెలుస్తోంది. కార్కీ కేవలం పాటల రచయిత మాత్రమే కాదు.. బాహుబలి మూవీ తమిళ వెర్షన్ కి డైలాగ్స్ రాసింది ఇతనే. అంతా కేదు.. ఆ మూవీలో కాలకేయుడు అండ్ సైన్యంతో మాట్లాడించిన కిలికి భాష కనిపెట్టినవారిలో కార్కీ కూడా ఒకడు. ఇప్పుడై రైటర్ తో మహేష్ మీద తీసే ఇంట్రడక్షన్ సాంగ్స్ ను రాయించనున్నారు. ఇంట్రడక్షన్ అంటే ఒక పాటేగా సాంగ్స్ అంటారేంటి అనుకోవచ్చు కానీ.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈ పాటను కార్కీతోనే రాయించనున్నారు.

కార్కీ రైటింగ్స్ పై మురుగదాస్ కి విపరీతమైన గురి కుదరడంతోనే.. మహేష్ సినిమాలో ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఫైనల్ చేయగా.. హారిస్ జైరాజ్ సంగీతం అందించనున్నాడు.