Begin typing your search above and press return to search.

చైతు అంత నచ్చాడా మాధవ్

By:  Tupaki Desk   |   3 Jun 2018 12:30 PM GMT
చైతు అంత నచ్చాడా మాధవ్
X
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి కోసం చాలా ఏళ్ళ తర్వాత మాధవన్ తెలుగు స్ట్రెయిట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే . గతంలో ఎన్నో సినిమాల కోసం ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగు బాష మీద గ్రిప్ లేని కారణంగా వదిలేసుకుంటూ వచ్చిన మాధవన్ ను సవ్యసాచి కథ మాత్రం బాగా ఎగ్జైట్ చేసిందట. అందుకే ఒప్పుకున్నట్టు తెలిసింది. దానికి తోడు చందు మొండేటి థ్రిల్లర్ ని టేకప్ చేసిన తీరు కార్తికేయలో చూసిన మాధవన్ ఎక్కువ ఆలోచించకుండా ఓకే చేసినట్టు తెలిసింది. సవ్యసాచి ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజి లో ఉంది. విడుదల ఇంకా ఖరారు కాలేదు. దీని తర్వాత చైతు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇంతకు ముందే చెప్పాడు. శైలజరెడ్డి అల్లుడు తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.

ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం మాధవన్ నే తీసుకోబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. సవ్యసాచి టైంలో చైతుకు మాధవన్ కు మంచి బాండింగ్ కుదరటంతో దీనికి కోసం రాయబారానికి చైతూనే పంపారట యూనిట్. కానీ మాధవన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సవ్యసాచిలో తనకు వచ్చే స్పందన బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు వినికిడి . ఆ మధ్య చిన్న యాక్సిడెంట్ తో కొంత కాలం రెస్ట్ లో ఉన్న మాధవన్ మళ్ళి కథలు వినే పనిలో పడ్డాడు. మొదటి సారి అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటించి అందులో కూడా హిట్ కొట్టిన మాధవన్ చైతు సినిమాకు ఓకే చెబితే వరసగా ఒకే హీరోతో రెండు సినిమాల్లో నటించడం మొదటిసారి అవుతుంది. సఖి-యువ లాంటి సినిమాలతో తెలుగు వారికి కూడా బాగా పరిచయమున్న మాధవన్ కు సవ్యసాచిలో నెగటివ్ రోల్ పెద్ద బ్రేక్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు