Begin typing your search above and press return to search.

అనుష్క సైలెన్స్‌ కి బ్రేక్‌!

By:  Tupaki Desk   |   25 Aug 2018 12:25 PM GMT
అనుష్క సైలెన్స్‌ కి బ్రేక్‌!
X
స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ గ్యాప్‌ కి కార‌ణ‌మేంటి? అంటూ ఇటు టాలీవుడ్ స‌హా అటు కోలీవుడ్‌ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అనుష్క బ‌రువు త‌గ్గే ప‌నిలో ఉంద‌ని - గౌత‌మ్‌ మీన‌న్ ప్రాజెక్టు ఆల‌స్య‌మ‌వుతోందని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. తాజాగా అన్నిటికి చెక్ పెడుతూ స్వీటీ స్వీటు లాంటి శుభ‌వార్త అందించింది.

అనుష్క ఓ భారీ ప్రాజెక్టుకు సంత‌కం చేసింది. మాధ‌వ‌న్ అలియాస్ మ్యాడీ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. టాలీవుడ్ స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఆయ‌నే ర‌చ‌యిత కూడా. ఇదో సైలెంట్‌ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశం కావ‌డంతో టైటిల్ కూడా `సైలెంట్` అని నిర్ణ‌యించారు. భాగ‌మ‌తి త‌ర్వాత అధికారికంగా అనుష్క న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

కెరీర్ ప‌రంగా ఎంతో సెల‌క్టివ్‌ గా ఉండే అనుష్క ఇంత‌కాలానికి ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవ్వ‌డం అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు- త‌మిళ్‌ లో అత్యంత క్రేజీగా తెర‌కెక్కించేందుకు కోన ప్లాన్ చేస్తున్నార‌ట‌. 2 కంట్రీస్ త‌ర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వ‌స్తాడు నా రాజు ఫేం హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రానికి కోడైరెక్ట‌ర్‌గా ప‌ని చేయ‌నున్నారు. 13బి - గురు వంటి విల‌క్ష‌ణ చిత్రాల్లో న‌టించిన మాధ‌వ‌న్ నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి చిత్రంలోనూ న‌టించారు. త‌దుప‌రి అనుష్క స‌ర‌స‌న న‌టిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.