Begin typing your search above and press return to search.

చిట్టిబాబు లాంటి పాత్రలో భాగమతి!

By:  Tupaki Desk   |   26 Aug 2018 6:48 AM GMT
చిట్టిబాబు లాంటి పాత్రలో భాగమతి!
X
గతంలో హీరో - హీరోయిన్లు అంటే ఓ అధ్బుతం అన్నట్టుగా ఉండేవారు. ఇక వారికీ శారీరక లోపాలు అనే మాటను ఎవరూ ఊహించలేకపోయేవారు.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. స్టార్ హీరోలయిన నాగార్జున వీల్ చైర్ కు పరిమిత మైన వ్యక్తిగా నటిస్తే - రవితేజ అంధుడిగా నటించాడు - రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించాడు. ఇక హీరోలేనా ఇలాంటి ప్రయోగాలకు రెడీ అయ్యేది? మరి హీరోయిన్లు ఏం తక్కువ అని అనుకుందో ఏమో స్వీటీ అనుష్క ఒక ప్రయోగాత్మక పాత్రకు సిద్ధం అయిందట.

'సైలెన్స్' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క బధిరురాలిగా నటిస్తుందని సమాచారం. అంటే వినికిడి లోపంతో పాటుగా మాట్లాడలేకపోవడం. 'భాగమతి' లాంటి పవర్ఫుల్ సినిమా తర్వాత అనుష్క సైన్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో అసలు డైలాగ్సే ఉండవట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. హేమంత్ గతంలో మంచు విష్ణు హీరో గా నటించిన 'వస్తాడు నారాజు' కు దర్శకుడు.. ఈ సినిమా కాకుండా 'ముంబై 125 KM' అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో తమిళ నటుడు R. మాధవన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. సినిమా స్టొరీ అమెరికా నేపథ్యంలో సాగుతుందని అందువల్ల షూటింగ్ అంతా అక్కడే ప్లాన్ చేశారట. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తారని సమచారం.