Begin typing your search above and press return to search.
'రాకెట్రీ' పై చాలా నమ్మకం
By: Tupaki Desk | 31 Oct 2018 4:12 AM GMTసౌత్ తో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ హీరోగానే కాకుండా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మాధవన్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. హీరోగా ఎన్నో సంచలన విజయాలను దక్కించుకున్న మాధవన్ ప్రస్తుతం విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ - మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిస్తూ దూసుకు వెళ్తున్నాడు. తాజాగా తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రంలో విలన్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు అయ్యింది.
‘సవ్యసాచి’ చిత్రంతో పాటు మాధవన్ ‘రాకెట్రీ’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. రాకెట్రీ ట్యాగ్ లైన్ ది నంబి ఎఫెక్ట్. ఇదో శాస్త్రవేత్త జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నంబి నారాయణన్ జీవితం చాలా విభిన్నమైనది. గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్న నారాయణన్ దేశ ద్రోహం కేసును ఎదుర్కోవల్సి వచ్చింది. పాకిస్తాన్ కు ఇండియా రహస్యాలను అమ్ముకున్నాడు అంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి.
నంబి నారాయణన్ దేశ ద్రోహం కేసుపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది. విచారణ అనంతరం నంబి నారాయణన్ పై దేశ ద్రోహం కేసును కొట్టి వేయడంతో పాటు, ఆయనపై ఆరోపణలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘రాకెట్రీ’ చిత్రం టీజర్ నేడు విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై మాధవన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. అద్బుతమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నంబి నారాయణన్ గురించి తెలిసిన వారు - తెలియని వారు అంతా కూడా ఈ సినిమా చూసి షాక్ అవుతారు అంటూ మాధవన్ ధీమాగా ఉన్నాడు. ఈ చిత్రం తన సినీ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని, అందరికి నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని అన్నాడు. ఈ సినిమా గురించిన ఒక వీడియోను మాధవన్ విడుదల చేశాడు. అందులో సినిమా గురించిన పలు విషయాలు వెళ్లడి చేశారు. మొత్తానికి మాధవన్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఏమవుతుందో చూడాలి.