Begin typing your search above and press return to search.
ఆ సీక్రెట్ చెప్పేసిన మాధవన్..!
By: Tupaki Desk | 2 Feb 2017 12:09 PM GMTశరీర బరువు తగ్గడం... చాలామందికి ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు పెరిగినప్పటి నుంచీ అదో మానసిక సమస్యగా మారిపోతుంది. అనుకున్నంతనే తగ్గడం కష్టం! తెల్లారేసరికి లేవాలి - జిమ్ కి వెళ్లాలి - ఒళ్లు వంచాలి - కష్టమైన ఎక్సర్ సైజులు చేయాలి. కాళ్లు లాగేస్తున్నా... కీళ్లు నొప్పెడుతున్నా.. వ్యాయామం తప్పదు. అలాంటి వారికి ఓ శుభవార్త తీసుకొచ్చాడు మాధవన్. తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పేశాడు.
మీరు గమనించారో లేదో.. ఈ మధ్య మాధవన్ కాస్త లావుగా కనిపించేవాడు. సాలా ఖడూస్ సినిమాలో కాస్త లావెక్కిన, కోచ్ పాత్రకు సరిపోయాడు. అయితే, ఆ లావు అలానే ఉంటే తరువాత సినిమాలకు బాగోదు కదా! అందుకే, ఒళ్లు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏముంది... వెంటనే ఒక పర్సనల్ ట్రైనర్ ను నియమించుకున్నాడు, ఇంట్లోనే జిమ్ పెట్టేసి - ఫటాఫట్ కొన్ని నెలల్లో ఒళ్లు తగ్గిపోయాడూ... అనుకుంటే తప్పులో కాలేసినట్టే!
మాధవన్ ఇంట్లోంచి కాలు కదపకుండా... జిమ్ లో కాలు పెట్టకుండా ఒళ్లు తగ్గించేసుకున్నాడు! అదెలా అనుకుంటున్నారా... జస్ట్ - ఆహార నియమాలను కాస్త మార్చుకున్నాడు. వ్యాయామం - యోగా - వాకింగ్ లాంటివి ఏవీ లేకుండా బరువు తగ్గిపోయాడు. మాధవన్ ఫాలో అయిన నియమం ఏంటంటే... సాయంత్రం ఆరు గంటల తరువాత ఎలాంటి ఆహారం తినడం మానేశాడు. అంతేకాదు... ఒకసారి భోజనం చేశాక మరో ఐదున్నర గంటల వరకూ ఏదీ తినడు! ఆహారం విషయంలో ఈ నియమాన్ని తు.చ. తప్పకుండా పాటించానని మాధవన్ చెప్పాడు. ఎలాంటి వర్కౌట్ లేకుండా తాను ఇలా సన్నబడటం చాలా హ్యాపీగా ఉందన్నాడు. సో... ఇదండీ మాధవన్ బయటపెట్టేసిన హెల్త్ సీక్రెట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/