Begin typing your search above and press return to search.
హాలీవుడ్ సినిమాలో మాధవన్
By: Tupaki Desk | 16 March 2015 3:30 PM GMTఉన్నట్లుండి మాధవన్‌కు ఏమైందో ఏంటో.. ఇటు తమిళంలో అటు హిందీలో బిజీగా ఉన్న హీరో కాస్తా ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. మూడేళ్ల కిందట హిందీలో 'తను వెడ్స్ మను'తో, తమిళంలో 'వేట్టై' లాంటి సూపర్ హిట్లు కొట్టాక.. జోడి బ్రేకర్స్ మినహా మరే సినిమాలో కనిపించలేదు మాధవన్. ఇంత గ్యాప్ ఎందుకంట అంటే ఓ బాక్సింగ్ కోచ్ జీవిత కథతో తెరకెక్కుతున్న 'సాలా ఖాడూస్' అనే సినిమా కోసం అని సెలవిచ్చాడు మాధవన్. హిందీతో పాటు తమిళంలోనూ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాధవన్ పడ్డ కష్టమెంతో అందరికీ బాగానే తెలిసొచ్చింది.
ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగానే తను వెడ్స్ మను సీక్వెల్‌కు ఓకే చెప్పిన మాధవన్‌ను ఇప్పుడు ఓ హాలీవుడ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. హార్రర్ సినిమాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఈవిల్ డెడ్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కనున్న ఐదో భాగంలో మాధవన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడట. ఈవిల్ డెడ్ సిరీస్‌లో ఇది ఐదో సినిమా. మాధవన్ హాలీవుడ్ సినిమాలో నటించడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు 'నైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్: ఆరిజన్స్' సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేశాడు. ఐతే ఈసారి చేయబోయేది అలాంటి చిన్న పాత్ర కాదు. దాదాపు లీడ్ రోల్ అని అంటున్నారు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటే హాలీవుడ్‌కే వెళ్లి సెటిలైపోతాడేమో.