Begin typing your search above and press return to search.

సవ్యసాచి సెట్లో ‘వాట్ ఎ డే’ అంటున్న మాధవన్

By:  Tupaki Desk   |   3 Dec 2017 11:33 AM IST
సవ్యసాచి సెట్లో ‘వాట్ ఎ డే’ అంటున్న మాధవన్
X
నాకు తెలుగు భాష రాదు.. కాబట్టి తెలుగులో సినిమా చేసే ఛాన్సే లేదు అన్నాడు చాలా ఏళ్ల కిందట మాధవన్. అలాంటి చార్మింగ్.. టాలెంటెడ్ యాక్టర్ ను ఎప్పుడూ తెలుగు సినిమాల్లో చూడలేమా అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు మాధవన్ మనసు మారింది. యువ దర్శకుడు చందూ మొండేటి ఏం మాయ చేశాడో ఏంటో.. మ్యాడీని ‘సవ్యసాచి’ సినిమాకు ఒప్పించాడు. ఎంతో ప్రత్యేకమైన పాత్ర అయి ఉంటే తప్ప మాధవన్ ఈ సినిమాకు ఒప్పుకుని ఉండడు.

ఈ సినిమా మొదలైన నాటి నుంచి మాధవన్ చాలా ఎగ్జైటెడ్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ తాను నటిస్తున్న సినిమా గురించి మధ్యలో మాట్లాడని మ్యాడీ.. ‘సవ్యసాచి’ గురించి మాత్రం ట్విట్టర్లో అప్ డేట్లు పెడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనపుడే మాధవన్ సెట్స్ నుంచి ఒక ఫొటోను పంచుకున్నాడు. తాజాగా మరో ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికర రీతిలో స్పందించాడు.

‘సవ్యసాచి’లో తన పాత్ర ఉండే ఇంటి నుంచి ఒక స్పెషల్ ఫొటో షేర్ చేశాడు మ్యాడీ. ఆ సెట్ చాలా ఆకర్షణీయంగా.. స్పెషల్ గా కనిపిస్తోంది. అందులోని ప్రాపర్టీస్ అన్నీ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. మధ్యలో మ్యాడీ చాలా ఎగ్జైట్మెంట్ తో చేతులు చాచి నిలబడి ఉన్నాడు. ఈ ఫొటో షేర్ చేసి.. ‘‘నా ఇల్లు.. ‘సవ్యసాచి’ సెట్స్ నుంచి.. మైత్రీ అఫీషియల్.. వాట్ ఎ డే’’ అని ట్వీట్ చేశాడు మాధవన్. అతడి స్పందన చూస్తుంటే.. ‘సవ్యసాచి’ మాధవన్ కు కొత్త అనుభూతిని పంచుుతన్నట్లు.. ఈ పాత్రను అతను చాలా ప్రత్యేకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. నాగచైతన్య-నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.