Begin typing your search above and press return to search.

చైతో ఫ్లాప్‌.. రౌడీతో అయినా మ్యాడీ హిట్టిస్తాడా?

By:  Tupaki Desk   |   21 Nov 2022 6:31 AM GMT
చైతో ఫ్లాప్‌.. రౌడీతో అయినా మ్యాడీ హిట్టిస్తాడా?
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన క్రేజీ మూవీ 'లైగ‌ర్‌' ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. మూడున్న‌రేళ్ల పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన శ్ర‌మంతా పూరి జ‌గ‌న్నాథ్ అజాగ్ర‌త్త కార‌ణంగా బూడిద‌లో పోసిన ప‌న్నీరుగా మారింది. భారీ ఆశ‌లు పెట్టుకుని క‌ఠోరంగా శ్ర‌మించిన ఈ మూవీ ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ కావ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌దుప‌రి సినిమాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెడుతున్నాడ‌ని తెలుస్తోంది.

'లైగ‌ర్‌' త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషీ'. టాలీవుడ్ స్టార్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీకి శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా హీరోయిన్ గా రౌడీకి జోడీగా స‌మంత న‌టిస్తోంది. క‌శ్మీర్ షెడ్యూల్ తో పాటు హైద‌రాబాద్ లో కొంత మేర షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ స‌మంత అనారోగ్యం కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చేసింది. ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో ల‌వ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన మ్యాడీ.. మాధ‌వ‌న్ న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీనిపై మైత్రీ వ‌ర్గాల నుంచి కానీ, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ నుంచి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. ఒక వేళ ఇదే నిజ‌మైతే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌, మాధ‌వ‌న్ ల కాంబినేష‌న్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుంద‌ని తెలుస్తోంది.

గ‌తంలో నాగ‌చైత‌న్య న‌టించిన 'స‌వ్య‌సాచి' మూవీలో మాధ‌వ‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే. శాడిస్ట్ పాత్ర‌లో విల‌న్ గా క‌నిపించాడు. ప‌ల ప్రేమ‌క‌థా చిత్రాల్లో ల‌వ్ బాయ్ గా ఆక‌ట్టుకున్న మాధ‌వ‌న్ ని అలాంటి పాత్ర‌లో ప్రేక్ష‌కులు, ఆయ‌న అభిమానులు చూడ‌లేక‌పోయారు..ఫ‌లితంగా ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. మిస్ కాస్టింగ్ , ఆక‌ట్టుకునే క‌థా, క‌థ‌నాలు లేక‌పోవ‌డంతో ఈ మూవీని ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు.

ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకుని శివ నిర్వాణ .. మాధ‌వ‌న్ పాత్ర‌ని 'ఖుషీ'లో నెగ‌టివ్ గా కాకుండా పాజిటీవ్ గా డిజైన్ చేస్తే కాంబినేష‌న్ సూపర్ హిట్ అనిపించుకుంటుంది. అలా కాకుండా చందూ మొండేటి చేసిన త‌ప్పే మ‌రోసారి చేస్తే 'ఖుషీ' కూడా 'స‌వ్యసాచి' త‌ర‌హా ఫ‌లితాన్నే అందుకుంటుంద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. 'ఖుషీ'లో మ్యాడీ న‌టించ‌డం క‌న్ఫ‌మ్ అయితే ఈ సారైనా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి హిట్ ఇస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.