Begin typing your search above and press return to search.
'టెంపర్' చూపించలేకపోతున్నా.. సారీ
By: Tupaki Desk | 26 March 2018 4:23 AM GMTటాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టెంపర్.. హిందీలో శింబ అనే టైటిల్ పై రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. రణవీర్ సింగ్ హీరోగా.. సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి.. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండడం.. కరణ్ జోహార్ నిర్మిస్తుండడంతో.. ఆ చిత్ర స్థాయి మరింతగా పెరిగింది.
ఇక తెలుగులో ప్రకాష్ రాజ్ పోషించిన విలన్ పాత్రను.. హిందీలో మాధవన్ చేస్తాడనే విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే మాధవన్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండగా.. రీసెంట్ గా అమెజాన్ సిరీస్ బ్రీత్ తో ఈ ఇమేజ్ మరింతగా పెరిగింది. అంతా సెట్ అయిపోయిందని అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు ఈ పాత్రను తాను చేయడం లేదని.. టెంపర్ రీమేక్ లో నటించడం లేదని చెప్పేశాడు కోలీవుడ్ హీరో మాధవన్. ఇందుకు కారణం.. తన ఆరోగ్యం సహకరించకపోవడమే అని చెప్పాడు. అంతే కాదు.. తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ ఫోటోను కూడా నెట్ లో పోస్ట్ చేశాడు మాధవన్.
రీసెంట్ గా వర్కవుట్స్ చేస్తున్న సమయంలో మాధవన్ చేతికి ఫ్రాక్చర్ అయింది. దీంతో రెండు నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. ఐదు నెలల పాటు జిమ్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పేశారు. దీంతో శింబ మూవీ ఛాన్స్ వదులుకుంటున్నట్లు చెప్పాడు మాధవన్. ఇంతటి మంచి టీం.. మూనీ వదులుకోవడం బాధగా ఉన్నా తప్పడం లేదని అన్నాడు ఈ మాజీ లవర్ బోయ్.